నల్గొండ

మహిళల రక్షణకు పటిష్ట చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 8: మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన రక్షణ చర్యలను చేపట్టిందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన స్నేహిత పోలీస్ బృందాలను రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాకేంద్రంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 60్ఫట్స్ రోడ్డులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ది చెందిన దేశాలకు ధీటుగా మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీటీమ్‌లను సిఎం కెసిఆర్ ఏర్పాటుచేయించారని చెప్పారు. మహిళలపై వేధింపులు, దాడులను అరికట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన షీటీమ్‌ల వల్ల తెలంగాణలో నేడు మహిళలు నిర్భయంగా తిరగలుగుతున్నారని చెప్పారు. షీటీమ్‌లతో పాటు కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో విద్యార్థినీలు, మహిళలపై వేధింపులను అరికట్టేందుకు నూతనంగా స్నేహిత బృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఈ బృందాలను సూర్యాపేట జిల్లా నుండి ప్రారంభించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. షీటీమ్‌లు, స్నేహిత బృందాల ఏర్పాటుతో పోకిరీల ఆటికట్టించినట్లు అవుతుందన్నారు. ఈ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయని అందువల్ల విద్యార్ధులు, పురుషులు మహిళలను వేధించే చర్యలను మానుకోకపోతే జైలుకు వెళ్లకతప్పదని హెచ్చరించారు. విద్యార్థినీలు, మహిళలకు ఏమైన సమస్యలు ఎదురైతే వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యార్థినీలు తోటి విద్యార్ధులతో స్నేహభావంతోనే మెలగాలని, అబ్బాయిలకు చనువు ఇవ్వవద్దని, మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు చేయవద్దన్నారు. తల్లిదండ్రుల ఆకాక్షంలను ఒమ్ము చేయకుండా పరిధిని మించి స్నేహాలు చేయవద్దని సూచించారు. విద్యార్థులు కూడా తమ సోదరినీలు, సన్నిహిత మహిళలకు ఇబ్బందులు ఎదరైతే ఈ బృందాలకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను మహిళల పేరిటే మంజూరీచేస్తున్నామన్నారు. ఆడపిల్లలు అంటే భారమన్న భావనను తొలగించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలుచేయడం జరుగుతుందన్నారు.