నల్గొండ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 8: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది పనితీరును మార్చి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ వాకాటి కరుణ వెల్లడించారు. గురువారం జిల్లావ్యాప్తంగా రాష్టస్థ్రాయి వైద్యాధికారులు 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీచేశారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం నిర్దేశించిన వైద్య సేవలను అందిస్తున్న తీరుపై పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో పనితీరు సక్రమంగా లేదని గుర్తించారు. అనంతరం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలోని వైద్యాధికారులు, రాష్టస్థ్రాయి అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ కరుణ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యాధికారులు ఉన్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రసవాలు చేపట్టాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. 70శాతం ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే విధంగా చూడాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాల వల్ల పేద ప్రజలు ఆర్ధికంగా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల వారు సిజేరియన్ ఆపరేషన్‌లు చేయడం వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రసవాలు జరపనందుకు సాకులు చెప్పవద్దని ఎక్కడో జరిగిన సంఘటనను సాకుగా చూపి ప్రసవాల పట్ల విముఖత చూపడం సహేతుకం కాదన్నారు. ప్రసవాలు జరిపేందుకు అవసరమైన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. వైద్యాధికారులు, సిబ్బంది ప్రజాసేవకులుగా పనిచేయాలని జాబ్‌చార్టుల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు.

సమీపిస్తున్న మిషన్ భగీరథ తొలి దశ గడువు
సర్కిల్‌తో పనులకు వేగం

నల్లగొండ, డిసెంబర్ 8: ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో తొలి దశ పనుల పూర్తికి నిర్ధేశించుకున్న గడువు సమీపిస్తుండటంతో పనుల్లో వేగం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు సాగిస్తుంది. ప్రభుత్వం తాజాగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల మిషన్ భగీరథ పనులను మరింత వేగంగా ముందుకు దూకించేందుకు నల్లగొండ కేంద్రంగా సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈగా ఉన్న రమణ నాయక్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ పురోగతిలో ఉన్న 492.37కోట్లతో పురోగతిలో ఉన్న ఎంవిఎస్ స్కీం కృష్ణా మంచినీటి పథకాలన్నింటిని కూడా గ్రిడ్‌లో విలీనం చేశారు. అయితే మిషన్ భగీరథలో ముందుగా ఈ డిసెంబర్ నెలాఖరునాటికి యాదాద్రి జిల్లా పరిధిలోని 600 జనావాసాలకు గోదావరి జలాలను అందించే పనులపై దృష్టి పెట్టారు. 79గ్రామాలకు ట్రయల్ రన్ వేయగా రోజురోజుకు ట్రయర్ రన్ గ్రామాల సంఖ్యను పెంచుకుంటు వెలుతున్నారు. భువనగిరి, ఆలేరు, వలిగొండ, రాజాపేట, తుర్కపల్లి, గుట్ట మండలాల్లో పైప్‌లైన్స్, ట్యాంకులు, శుద్ధికేంద్రాలు, పంపింగ్, విద్యుత్ స్టేషన్ల నిర్మాణం జోరుగా సాగుతుంది. 813కోట్లతో చేపట్టిన పనుల్లో ముందుగా గోదావరి జలాల సరఫరా లక్ష్యంగా ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసే లక్ష్యంతో సాగుతున్నారు. ఉదయ సముద్రం నుండి ఆలేరు నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరందించే పథకం పంపింగ్ స్టేషన్ పనులు సైతం తుది దశకు చేరుకుంటున్నాయి. ఇక సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోని గ్రామాల మిషన్ భగీరథ పనులు సైతం కొనసాగుతున్నాయి.