నల్గొండ

సాగర్ పునాదిరాయికి 62 ఏళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, డిసెంబర్ 9: బహుళార్ధసాధక ప్రాజెక్టు, తెలంగాణ, ఆంధ్రా తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పునాదిరాయికి నేటితో 61ఏండ్లు నిండి 62వ ఏండ్లు ప్రారంభమయ్యాయి. ఆనాడు భారత ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రు తన కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజల జీవనాధారంగా 1955డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్‌కాలనీలో పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఇక్కడి జరిపే శంకుస్తాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికి శంకుస్థాపన అని, శంకుస్థాపనకు పవిత్రకార్యంగా అనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కుడికాల్వను 1956 అక్టోబర్ 10న అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించగా 1959లో ఆనాటి గవర్నర్ భీంసేన్ సచార్ ఎడమకాల్వ పనులను ప్రారంభించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 22లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నేటికి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో చేరలేకపోతుంది. అప్పట్లో 110చదరపు మైళ్ల వైశాల్యంతో సాగర్ జలాశయం నిర్మించారు. గరిష్ట నీటిమట్టం 590అడుగులు కాగా కనీస నీటిమట్టం 510అడుగులుగా నిర్ణయించారు. 408టిఎంసిలను అప్పట్లో నిల్వగా పేర్కొనగా జలాశయంలో పేరుకపోయిన పూడిక కారణంగా 312టిఎంసిలకు కుదించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే పొడవైన రాతి ఆనకట్టగా పేరుపొందింది. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు సాగునీటితోపాటు తాగునీటిని అందిస్తూ విద్యుత్‌కాంతులను వెదజల్లుతూ విరజిల్లుతుంది. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలకు కారణం కావడం విచారకరం.