నల్గొండ

ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, డిసెంబర్ 9: పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, కెజి టూ పిజి ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ఒక్కరోజు దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో బిజెపి జిల్లా అధ్యక్షులు నూకల నర్సింహ్మారెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్ధి సంఘం జిల్లాఅధ్యక్షులు ఏర్పూల శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్ధి అమరుల త్యాగాల పునాధుల మీద అధికారంలోకి వచ్చిన టి ఆర్ ఎస్ ప్రభుత్వం నేడు విద్యార్ధులను చదువులకు దూరం చేసే విధంగా ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు విడుదల చేయడంలేదని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగు పడుతాయని ఆశించిన విద్యార్ధులకు నిరాశే ఎదురవుతుందని, టి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి అయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో, ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లింపుల్లో దారుణంగా విఫలమైందని విమర్శించారు. సి ఎం కేసి ఆర్ ఇకనైనా మాయమాలు మాని విద్యార్ధుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర సాధన ఉద్యమ తరహాలో మరో ఉద్యమం సాగిస్తామన్నారు. ఈ దీక్షకు డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కోట్ల అశోక్‌రెడ్డి మద్దతు తెలిపారు.