నల్గొండ

అవినీతి రహిత సమాజం అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 9: ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే అవినీతి రహిత సమాజం సాధ్యమవుతుందని ఇందుకు ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్ భవన్‌లో జిల్లా అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన అవినీతి నిరోధక దినోత్సవ సదస్సును ఆయన ప్రారంభించి ప్రజలు, అధికారులు, విద్యార్థులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు దేశంలో అవినీతి వ్రేళ్లూనుకుపోయిందని అవినీతి నిర్మూలన ప్రభుత్వంతో మాత్రమే సాధ్యంకాదని ప్రజలంతా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. నగదు రహిత విధానంతో అవినీతికి కళ్లెం వేయవచ్చని ఇందుకు ప్రజలు, వ్యాపారు, విద్యార్థులు నగదు రహిత లావాదేవివైపు మళ్లాలన్నారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, కార్డు సిస్టమ్‌ల పట్ల తల్లిదండ్రులకు, ప్రజలకు, గ్రామీణులకు అవగాహాన కల్పించాలన్నారు. ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న ప్రజాధనం అవినీతి కారణంగా ప్రజలకు 40శాతం మేరకే చేరుతుందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించినప్పుడే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఎసిబి డిఎస్పీ కోటేశ్వర్‌రావు మాట్లాడుతు ఏటా 20మందిపై అవినీతి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ప్రజలు మరింత చొరవతో అవినీతి కేసులపై తమకు సమాచారం అందించాలన్నారు. తమ శాఖ అవినీతి నిరోథక వారోత్సవాల్లో భాగంగా పాఠశాల, కళాశాలల స్థాయి విద్యార్థులకు అవినీతి నిరోథక చర్యలపై అవగాహాన కల్పించేందుకు ర్యాలీలు, వ్యాసరఛన, వక్తృత్వ పోటీలు నిర్వహించిందన్నారు. ఈ సందర్భంగా ఎసిబి నిర్వహించిన సదరు పోటీల్లో విజేతలైన వారికి, అవినీతిపై ఎసిబికి సమాచారం అందించిన వారికి ప్రశంస పత్రాలు అందించారు.
ఆదర్శ సింగిల్‌విండోగా తీర్చిద్దిదుతా
* చైర్మన్ నూక సైదులు యాదవ్
కట్టంగూర్, డిసెంబర్ 9: కట్టంగూర్ సింగిల్‌విండోను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన సింగిల్‌విండోగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కట్టంగూర్ సింగిల్‌విండో నూతన చైర్మన్ నూకా సైదులు యాదవ్ అన్నారు. శుక్రవారం స్ధానిక సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, సహకార వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. సింగిల్‌విండో ద్వారా మండల రైతాంగానికి మెరుగైన సేవలు అందించి బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తతృం చేసి లాభాలబాటలోకి తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. రైతులకు సరపడా ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు త్వరితగతిన రుణాలు అందించేలా చొరువ చూపుతానన్నారు. తన ఎన్నికకు సహకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, స్ధానిక జడ్పిటిసి మాద యాదగిరి, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కర్నాటి రంగయ్యలతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.

సోనియాతోనే రాష్ట్రం సిద్ధించింది
* డిసిసి అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య
ఆలేరు, డిసెంబర్ 9: ఎఐసిసి అధ్యక్షురాలు, యూపి ఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చొరవ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని డిసిసి అధ్యక్షులు బూడిద భిక్షమయ్య గౌడ్ తెలిపారు. శుక్రవారం స్ధానిక రైల్వేగేటు వద్ద సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్‌చేసి పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి యూపి ఏ ప్రభుత్వంలో అన్ని పార్టీల వారిని ఒప్పించి, మెప్పించి దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాందీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చొరవ ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా టి ఆర్ ఎస్ ప్రభుత్వం మారుస్తుందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం నేడు లోటు బడ్జెట్‌గా మారిపోయిందన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకం ఇప్పటి వరకు కూడా ప్రజలకు చేరుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉపేందర్‌రెడ్డి, హరినాధ్, జైనుద్దిన్, సాగర్‌రెడ్డి, యజాజ్, మల్లేష్, సంతోష్, శ్రీకాంత్, అజయ్, రాజేశ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు
* సూర్యాపేట ఎస్పీ పరిమళ
సూర్యాపేట, డిసెంబర్ 9: స్థానిక ఎస్పి క్యాంపు కార్యాలయంలో జరిగిన డయల్ యువర్ ఎస్పి కార్యక్రమం అనంతరం ఎస్పి పరిమళ హనానూతన్ విలేఖరులతో మాట్లాడారు. డయల్ యువర్ ఎస్పి, గ్రీవెన్స్‌డే కార్యక్రమాలు ప్రారంభించిన నాటి నుండి అత్యధికంగా జిల్లావ్యాప్తంగా భూవివాదాలు, కుటుంబసభ్యుల మద్య గొడవలు, ఆస్తి గొడవలపై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. త్వరలోనే జిల్లావ్యాప్తంగా అన్ని సమస్యలు సకాలంలోపరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులల్లో 90 శాతం పూర్తిచేశామన్నారు.