నల్గొండ

జిల్లా కోసం రిలే దీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, డిసెంబర్ 15: మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలేనిరాహారాదీక్షలు గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, శాసనమండలి మాజీ చీఫ్‌విప్ డి.్భరతిరాగ్యానాయక్‌లు మాట్లాడుతూ ఇప్పట్నుండి దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. ప్రతి రోజు నిత్యనూతన కార్యక్రమంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించేలా చేయాలన్నారు. శాంతియుత, ప్రజాస్వామ్య మార్గంలోనే జిల్లా సాధన ఉద్యమం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి డి.స్కైలాబ్‌నాయక్, పి.రాంలింగయ్య, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు ఎండి.కరీం, సిపిఎం నాయకులు డి.మల్లేష్, వి.వెంకటేశ్వర్లు, జగదీష్‌చంద్ర, గాదె పద్మ, ఆర్.పరశురాములు, ఎం.రవినాయక్, నాగునాయక్, సైదానాయక్, సిపిఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సమీఖాద్రీ, టిడిపి నాయకులు ఎండి.యూసుఫ్, బంటు వెంకటేశ్వర్లు, సాధనేని శ్రీనివాస్, పాదురి ప్రసాద్, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్యలు పాల్గొన్నారు.
నరుూం నిందితులపై చార్జిషీటు దాఖలు
మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 15: గ్యాంగ్‌స్టర్ నరుూం సంబంధించిన కేసుల్లో నిందితులైన ఐదుగురిపై ఒన్‌టౌన్ పోలీసులు చార్జీషీటును గురువారం స్థానిక జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. పట్టణంలోని ఈదులగూడకు చెందిన వ్యక్తి సత్యనారాయణరెడ్డికి చెందిన ఇల్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న అభియోగంపై వారిపై ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. వీరిలో అరెస్టు అయిన నరుూం అత్త సుల్తానా, సుల్తానా కూతురు చాందిని, అల్లుడు మసూద్, నరుూం చెల్లెలు హసీనా, ఫహీంలున్నారు. వారిపై పూర్తి స్థాయిలో సిట్ ఇన్స్‌పెక్టర్ సుధారక్, ఒన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతిలు విచారణ జరిపిన చార్జీషీటును దాఖలు చేశారు. ఇంకో కేసులో చార్జీషీటు దాఖలు చేయాల్సి ఉంది.
చదువుతో పాటు దేశ ఔన్నత్యాన్ని
ప్రపంచ దేశాలకు చాటాలి
ఎంపీ గుత్తా
నల్లగొండ టౌన్, డిసెంబర్ 15 : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి దేశ సమైఖ్యతకు కాపాడుతూ భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. గురువారం పట్టణ సమీపంలోని మిర్యాలగూడ రోడ్డులో గల కేంద్రీయ విశ్వవిద్యాలయాల 53వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యాలయానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన సమస్యలను కేంద్ర సంఘటన కమీషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తాననన్నారు. రాబోయే సంవత్సరం నుండి 1 నుండి 12వ తరగతుల ఏర్పాటుకు అన్ని వౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
విద్యాలయ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 1963లో 20 రెజిమెంటల్ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయం విలీనం చేసుకొని ప్రస్తుతం దినదిన ప్రవర్ధమానంగా 1150 విద్యాలయాలతో విద్యార్థులకు చదువును అందిస్తుందన్నారు. ప్రస్తుతం ఢీల్లీ మెయిన్ బ్రాంచ్‌తో పాటు హైద్రాబాద్‌లో రీజనల్, ఇతర దేశాలైన రష్య, ఇరాన్‌లలో విద్యాలయాలు ఉన్నాయని, ఇన్ని విద్యాలయలతో విద్యను అందించే సంస్థలో తాను పనిచేసే సంస్థలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు దేశభక్తికి సంబంధించిన తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్లు యజ్ఞనారాయణ, కె.సత్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ భారతి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు అంతటి జ్యోతిసమాధానం,నోముల సత్యనారాయణ, రవికుమార్, సరిత, అశ్రీయజబీన్, మేరి, అవుట రవీందర్, నవీన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.