నల్గొండ

గులాబీ గ్రూపుల రగడ..డిసిసిబి చైర్మన్ విలవిల !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 20: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో టిఆర్‌ఎస్ పార్టీలో సాగుతున్న అంతర్గత అధిపత్య పోరు కాస్తా డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు పదవికి ఎసరు తెచ్చేలా తయారైందన్న ప్రచారం గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. జిల్లా పార్టీలో పైకి అంతాబాగున్నట్లుగానే కనిపిస్తున్న లోలోపల మంత్రి జి.జగదీష్‌రెడ్డి వర్గానికి, టిఆర్‌ఎస్‌లో చేరిన ఎంపి గుత్తా సుఖేందర్‌డ్డి వర్గానికి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు పాండురంగారావు చైర్మన్ పదవికి ఎసరు పెట్టేదిగా తయారైందన్న గుసగుసలు గులాబీ గూటి నుండి వినిపిస్తున్నాయి. గుత్తా అనుచరుడిగా ముద్రపడిన పాండురంగారావును డిసిసిబి చైర్మన్ పదవి నుండి తొలగించేందుకు అతను చైర్మన్‌గా ఉన్న కాపుగల్లు సహకార సంఘం సొసైటీని రద్ధు చేసేలా జగదీష్‌రెడ్డి వర్గం సూర్యాపేట జిల్లా డిసివో ద్వారా తెరవెనుక పావులు కదిపినట్లుగా తెలుస్తుంది. తద్వారా డిసిసిబి చైర్మన్ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించి జగదీష్‌రెడ్డికి అనుకూలంగా ఉన్న యెడవెల్లి విజయేందర్‌రెడ్డిని మరోసారి చైర్మన్‌ను చేయాలన్న పథకం అమలు చేస్తున్నట్లుగా గులాబీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. నిజానికి సీజ్ చేసిన ధాన్యం మాయమైన కేసులో పాండురంగారావు ప్రమేయం నేరుగా లేనందునా కాపుగల్లు సొసైటి రద్ధు నిర్ణయాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి తలుచుకుంటే నిలుపుదల చేయించేవారని పాండురంగారావు వర్గం భావిస్తుంది. అయితే పాండురంగారావుపై వేటు వేయడం ద్వారా అక్రమాలను టిఆర్‌ఎస్ సహించబోదని చాటడంతో పాటు ఎంపి గుత్తా వర్గాన్ని దెబ్బతీయవచ్చన్న ఎత్తుగడ దాగి వుందని అందుకే మంత్రి జగదీష్‌రెడ్డి కాపుగల్లు సొసైటీ రద్ధు నిర్ణయంలో పాండురంగారావును ఆదుకోలేదని తెలుస్తుంది.
కాగా తుమ్మల అండతో తాత్కాలిక ఊరటమరోవైపు కాపుగల్లు సొసైటీ రద్ధు నిర్ణయాన్ని సవాల్ చేస్తు హైకోర్టును ఆశ్రయించిన పాండురంగారావుకు రద్ధు నిర్ణయంపై కోర్టు స్టేటస్ కో ఇవ్వడం ఊరటనిచ్చింది. కాపుగల్లు సొసైటీ రద్ధు నిర్ణయంపై సహకార ట్రిబ్యూనల్‌కు వెళ్లేందుకు పాండురంగారావు రెండు వారాలు గడువు ఇచ్చింది. ఆయనకు తీర్పు వ్యతిరేకంగా వస్తే నాలుగువారాల పిదప డిసిసిబి చైర్మన్‌కు ఎన్నిక సైతం నిర్వహించాల్సివుంటుంది. జిల్లా మంత్రి నుండి తనకు అండ లభించకపోవడంతో తన సామాజికవర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సహకారంతో హైకోర్టును ఆశ్రయించిన పాండురంగారావు తాత్కాలికంగా తన పదవీ గండాన్ని తప్పించుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. హైకోర్టు ఇచ్చిన గడువులోగా పాండురంగారావు ట్రిబ్యూనల్ ముందు తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవడంతో పాటు టిఆర్‌ఎస్ అధిష్టానాన్ని, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డిని ఏ రకంగా మెప్పించి తన డిసిసిబి చైర్మన్ పదవిని నిలబెట్టుకుంటారన్నదీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.