నల్గొండ

కామినేని వైజంక్షన్‌పై కలెక్టర్, ఎస్పీల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జనవరి 20: విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించినప్పటికీ నార్కట్‌పల్లి కామినేని వైజంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో జిల్లా అధికారులు ఎన్‌హెచ్ ఐ అధికారులతో కలసి శుక్రవారం ప్రమాదం నివారణకై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం బృందం ఈ వైజంక్షన్ వద్ద జరిగిన ప్రమాదాల సంఖ్యను, వివరాలను స్ధానిక పోలీసుల నుండి అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర నాయకుడైన మాజీ పార్లమెంట్ సభ్యుడు లాల్‌జాల్ పాష లాంటి ఉన్నత శ్రేణి నాయకులు ఎంతో మంది మరణించారని, ఈ ప్రమాదాల నివారణకు వై జంక్షన్ మూసివేయడం తప్ప మరొక్క మార్గం లేదని పరిసర ప్రాంతాల ప్రజలు కలెక్టర్‌కు వివరించారు. దీంతో స్పందించిన ఆయన ఎన్‌హెచ్‌ఐ అధికారులతో చర్చించగా ఆరు లైన్ల జాతీయ రహదారిగా ఈ రహదారి విస్తరించబోతుందని, ఆ సమయంలో ఈ వైజంక్షన్ వద్ద ఫ్లై ఒవర్ నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుందని పేర్కొన్నారు. అప్పటివరకు ప్రమాదాల నివారణకై తీసుకోవల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎన్‌హెచ్ ఐ అధికారులు హిందుమతి, నాగరాజు, జీ ఎం ఆర్ అధికారులు నాగరాజు, దూదిమెట్ల సత్తయ్యయాదవ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత విద్యను అందిస్తాం
ఆలేరు, జనవరి 20: ప్రతి పేద విద్యార్ధికి కేజి టూ పిజి విద్యను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత అన్నారు. శుక్రవారం స్దానిక ఆర్‌పిఆర్‌పి పాఠశాలలో విద్యార్ధులకు పడక మంచాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధులందరికీ సమాన విద్యవకాశాలు కల్పించడంలో భాగంగా విద్యారంగాన్ని ముఖ్యమంత్రి కేసి ఆర్ పటిష్టపరుస్తున్నారని తెలిపారు. అన్ని ఆశ్రమ పాఠశాలల్లోని వసతిగృహాల్లో విద్యార్ధులకు సన్నబియ్యం అందించిన ఘనత కేవలం టి ఆర్ ఎస్‌కే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని విద్యారంగాన్ని నాలెడ్జ్ పార్కుకు తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూర్య, జెడ్పిటిసి పరమేశ్వర్, వైస్ ఎంపీపీ కిష్టయ్య, ఇంచార్జీ సర్పంచ్ సంతోష్, పాఠశాల ప్రిన్సిపల్ నాగకళ్యాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.