నల్గొండ

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జనవరి 21: చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులతో కలసి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. శనివారం చెర్వుగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన అనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణపై సుమారు రెండు గంటల పాటు సమగ్రంగా సమీక్షించి పలు సూచనలు అందించారు. కొండపైన కలయతిరిగిన కలెక్టర్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన స్వామి వారి కళ్యాణం, అగ్నిగుండాలు, పలు కార్యక్రమాల్లో భక్తులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. తెలంగాణ నలుమూలల నుండి స్వామివారి కళ్యాణానికి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు కల్యాణం తిలకించేలా, తలంబ్రాలు సమర్పించేలా విస్త్రృత ఏర్పాట్లు చేయాలని, అందుకు కావల్సిన తగు సూచనలను కళ్యాణమండపాన్ని సందర్శించి తెలియజేశారు. ఉత్సవాల్లో ముఖ్య భూమికైన అగ్నిగుండాలకు రైతులు తాము పండించిన పంటను తీసుకొని పెద్ద ఎత్తున తరలివస్తారని, గత ఏడాది అగ్నిగుండంలో జరిగిన పొరపాట్లను నెమరవేసుకొని అలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని దేవాదాయ శాఖ అదికారులకు సూచించారు. పోలీసు శాఖ అధికారులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ కొండపైకి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. మంచినీటి వసతి, అంటు రోగాలు ప్రభలకుండా అధికారులు అప్రమత్తం చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వివిధ శాఖల అదికారులతో సమన్వయం నెలకొల్పుకొని బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జేసి నారాయణరెడ్డి, ఆర్‌డి ఒ వెంకటాచారి, ఎండి ఒ సురేష్, తహశీల్ధార్ విజయలక్ష్మీ, సర్పంచ్ రమణబాలకృష్ణ, దేవాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి గుత్తా మనోహర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో
ఆదర్శంగా నిలవాలి

నల్లగొండ, జనవరి 21: స్వచ్ఛ్భారత్ లక్ష్యాల సాధనలో కలెక్టరేట్ ఉద్యోగులు అందరికి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది స్వచ్ఛ్భారత్ నిర్వాహణ, కార్యాలయల పరిశుభ్రతలను పరిశీలించారు. ట్రేజరరీ, పంచాయతీ, ప్రణాళిక, సంక్షేమ తదితర శాఖల బ్లాకులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లా అధికారులు, ఉద్యోగులు తమ శాఖల కార్యాలయలను పరిశుభ్రం ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం, ఫైళ్ల నిర్వాహణ చర్యలు చేపట్టాలన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే కలెక్టరేట్‌లో వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు. సమస్యలపై వచ్చే ప్రజలతో స్నేహభావంతో పలకరించి వారి పనులు చక్కబెట్టాలన్నారు. కలెక్టరేట్ బయట వివిధ చోట్ల ఉన్న ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో సైతం విధిగా శనివారం స్వచ్ఛ్భారత్ నిర్వహించాలన్నారు. వాటిల్లో సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెసి సి.నారాయణరెడ్డి, డిఆర్‌వో ఖిమ్యానాయక్, సిపివో భారతి, డిపివో ప్రభాకర్‌రెడ్డి ప్రభృతులు ఉన్నారు.