నల్గొండ

ఉపాధి నిధుల వినియోగంపై మంత్రి సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జనవరి 21: గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సకాలంలో వినియోగించని అధికారులపై మంత్రి జూపల్లి క్రిష్ణారావ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం భువనగిరి మండలం బండసోమారం గ్రామంలో చేపడుతున్న గ్రామీణ ఉపాధి హామి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతు ఇజిఎస్ నిధులను ఉపయోగించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నూరు శాతం ఇజిఎస్ పనులను చేపట్టిన గ్రామాలలో అభివృద్ధిపనులను చేపట్టేందుకు 75శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చిలోపు 100శాతం 100రోజుల పని కల్పించాలని 65 శాతం కంటే తక్కువ పని కల్పించిన అధికారులపై చర్యలు చేపడ్తామని హెచ్చరించారు. 83శాతం పనులు కల్పించిన బండసోమారం గ్రామం ఇజిఎస్ అధికారులను అభినందిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30లక్షల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామి పని కల్పించాలని కోరిన వారికి వారంలోపు జాబ్‌కార్డులు అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథరం ద్వారా గ్రామంలో అభివృద్ధితోపాటు రైతుకు మేలు జరుగుతుందని, ప్రజలు వలసపొవాల్సిన అవసరముండదన్నారు. వ్యవసాయ పనులు లేని రోజులలో పనికల్పించాలని ఇజిఎస్ అధికారులకు సూచించారు. మహిళలు, యువకుల భాగస్వామ్యంతో గ్రామాలలో అవసరాల మెరకు అభివృద్ధిపనులను గుర్తించి పనులను చేపట్టాలన్నారు. బండసోమారం గ్రామం 100రోజుల పని అందరికీ కల్పించి రాష్ట్రంలోనె ఆదర్శ గ్రామంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డిఆర్‌డిఒ జెసి సైదులు, డిఆర్‌డిఒ పిడి వెంకట్రావ్, నాయకులు భువనగిరి ఎంపిపి తోటకూరి వెంకటేశ్ యాదవ్, తహసిల్దార్ కె.వెంకట్‌రెడ్డి, ఎంపిడివొ గోపాల కిషన్‌రావ్, సర్పంచ్ సుర్పంగ మాధవి తదితరులు పాల్గొన్నారు.

* ప్రవాస భారతీయుడి ఔదార్యం
హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణానికి
రూ. 20లక్షల విరాళం
సూర్యాపేట, జనవరి 21: విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు తమ స్వగ్రామాల అభివృద్దికి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పిలుపునందుకొని సూర్యాపేట మండలపరిధిలోని యండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు గుండా సత్యనారాయణ గ్రామంలో హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణానికి రూ. 20లక్షల విరాళం అందించేందుకు అంగీకారం తెలిపారు. శనివారం గుండా సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్‌ను కలిశారు. ఇటీవల బెంగళూర్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయ దివస్‌కు హాజరుకాగా ప్రవాస భారతీయులను సమన్వయ పర్చేందుకు ప్రభుత్వం నియమించిన ఐఎఫ్‌ఎస్ అధికారి విష్ణువర్దన్‌రెడ్డి తనతో సంప్రదింపులు జరుపగా గ్రామాభివృద్దికి చేయూత నివ్వాలనే ఆలోచనతో వచ్చినట్లుగా కలెక్టర్‌కు తెలిపారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ యండ్లపల్లి గ్రామంలో అద్దె భవనంలో ఆరోగ్య ఉపకేంద్రం కొనసాగుతున్నట్లు గ్రామస్తులు తన దృష్టికి తెచ్చారని, అందువల్ల గ్రామంలో సబ్‌సెంటర్ భవనాన్ని నిర్మిస్తే బాగుటుందని సూచించగా అందుకు ఆయన అంగీకారం తెలిపారు. దీంతో గ్రామస్తులను సంప్రదించగా భవన నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తంచేయడంతో ఈనెల 25న మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 76 వృద్దాప్యంలో ఉన్న గుండా సత్యనారాయణ దశాబ్దాల క్రితమే ఆమెరికాకు వెళ్లి ఇంజనీర్‌గా పనిచేసి సికాగోలో నివస్తున్నట్లు తెలిపారు. స్వగ్రామ అభివృద్ది కోసం ముందుకు వచ్చిన ప్రవాస భారతీయులు సత్యనారాయణను ఈ సందర్భంగా కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో నాగిరెడ్డి, న్యాయవాది పంతంగి కృష్ణ, గుండా లక్ష్మయ్య, వాస నవీన్ పాల్గొన్నారు.