నల్గొండ

ఏయిమ్స్ దారి ఎటు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 10: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏయిమ్స్ ఏర్పాటు చేస్తామన్న హామీ మేరకు ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఏయిమ్స్ మంజూరును చేస్తున్నట్లుగా చేసిన ప్రకటన ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసుల్లో హర్షాతీరేకాలు నింపింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన ఏయిమ్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నదీ ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. యాదాద్రి జిల్లా పరిధిలోని బీబీనగర్ నిమ్స్‌ను ఏయిమ్స్‌గా ప్రకటించి అభివృద్ధి చేస్తారా లేక మరో జిల్లాలో ఏయిమ్స్‌ను ఏర్పాటు చేస్తారా అన్న చర్చ జిల్లా ప్రజాప్రతినిధుల్లో సాగుతుంది. గతంలో సిఎం కెసిఆర్ తెలంగాణకు వచ్చే ఏయిమ్స్‌ను బీబీనగర్‌లోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సిఎం కెసిఆర్ ఇప్పుడు తన హామీ మేరకు ఏయిమ్స్‌ను బీబీనగర్‌లో ఏర్పాటు చేస్తారా లేదా అన్నదానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి బీబీనగర్‌లో 161ఎకరాల్లో 100కోట్లతో నిమ్స్ ఆసుపత్రి, మెడికల్ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని నిర్మాణం జరిపించినా అసంపూర్తి భవనానికే ఆయన అప్పట్లో 2009 ఎన్నికల నేపధ్యంలో నామమాత్ర ప్రారంభోత్సవం చేశారు. తదుపరి మళ్లీ వైఎస్ ప్రభుత్వం వచ్చినా ఆయన ఆకస్మిక మరణంతో నిమ్స్ నిర్మాణ పనుల పూర్తి పెండింగ్‌లో పడింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకా అసంపూర్తి పనులను పూర్తి చేసి నిమ్స్‌లో వైద్య సేవలను ప్రారంభించారు. అయితే వైఎస్ తలపెట్టినట్లుగా మెడికల్ కళాశాలగా, వైద్య పరిశోధన కేంద్రంగా నిమ్స్ పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకోలేదు.

నిమ్స్‌లో ఏయిమ్స్‌పై సందేహాలు
తెలంగాణ ఏయిమ్స్ ఏర్పాటుకు కావాల్సిన వసతులన్ని బీబీనగర్ నిమ్స్‌లోఅందుబాటులో ఉన్నందునా ఏయిమ్స్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. బీబీనగర్ నిమ్స్‌ను ఏయిమ్స్‌గా మార్చినట్లయితే ఉమ్మడి నల్లగొండ, వరంగల్, మెదక్, హైద్రాబాద్ జిల్లాల ప్రజలకు వైద్యపరంగా అధిక ప్రయోజనకరంగా ఉండనుంది. అయితే తెలంగాణలోని ఇతర జిల్లాల టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సైతం నిమ్స్‌ను తమ జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలంటు అంతర్గత ప్రయత్నాలు ఆరంభించడంతో బీబీన్‌గర్‌లో ఏయిమ్స్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఏయిమ్స్‌ను సిద్ధిపేట, సంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేయవచ్చన్న ప్రచారం యాదాద్రి జిల్లా వాసులను కలవర పరుస్తుంది. ఈ నేపధ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ ఎంపిలు, ప్రజాప్రతినిధులు ఏయిమ్స్‌ను బీబీనగర్‌లో ఏర్పాటు చేసేలా సిఎం కెసిఆర్‌ను ఒప్పించి మరోసారి ఆయన నుండి స్పష్టమైన ప్రకటనను చేయించాల్సివుంది. లేనట్లయితే గతంలో యాదాద్రి జిల్లా పరిధిలో ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పక్షాలకు ప్రధాన ప్రచార అంశమైన నిమ్స్ సమస్య ఏయిమ్స్ రూపంలో మళ్లీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
బీబీనగర్‌లో ఏయిమ్స్‌ను ఏర్పాటు చేయించడంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేతలు విఫలమైతే విపక్షాలు ఇదే అవకాశంగా టిఆర్‌ఎస్‌పై దాడికి కాచుకొని ఉన్నాయి. ఇదివరకే తెలంగాణ ఏర్పాటు పిదప కూడా నిమ్స్ నిర్మాణ పనుల పూర్తిలో జాప్యానికి యాదాద్రిభువనగిరి జిల్లా ప్రజాప్రతినిధిగా ఉన్న అధికార పార్టీ నేతకు పరిసర హైద్రాబాద్ ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో భాగస్వామ్యాలు ఉండటమే కారణమంటు అప్పట్లో విపక్షాలు ఆరోపణలు సంధించాయి. బీబీనగర్‌లో ఏయిమ్స్ ఏర్పాటుకాని పక్షంలో మరోసారి అవే ఆరోపణలతో విపక్షాలు టిఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టనున్నాయి. మరోవైపు తెలంగాణకు ఏయిమ్స్ మంజూరు ఘనతంతా టిఆర్‌ఎస్‌దే అన్నట్లుగా చెప్పుకోవడం సరైంది కాదని యాదాద్రి జిల్లా కాంగ్రెస్, బిజెపి నేతలు వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఏయిమ్స్‌లను కేటాయించాలని ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ స్పష్టంగా పేర్కొందని ఈ మేరకు ఇప్పుడు తెలంగాణకు ఏయిమ్స్ దక్కిందని కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. అలాగే గత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీని తమ బిజెపి ప్రభుత్వం నెరవేర్చి తెలంగాణకు ఏయిమ్స్‌ను మంజూరు చేసిందని బిజెపి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పి.వి.శ్యాంసుందర్ అన్నారు. బీబీనగర్‌లోనే ఏయిమ్స్ ఏర్పాటు చేయాలని మరో జిల్లాకు తరలించే యత్నాలు సరైంది కాదన్నారు.

ఎడారిగా ఎడమకాల్వ ఆయకట్టు
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 10: ఎడమకాల్వ పరిధిలోని ఆయకట్టు రానురాను ఎడారిగా మారనున్నదని సిపిఎం రాష్టక్రార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం నుండి ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని 20నుండి 30శాతం వరకు చివరి భూములకు నీరందడంలేదన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బచావత్ ట్రిబ్యూనల్ తీర్పుకంటే రెట్టింపుగా నీటిని కొల్లగొట్టుకుపోతున్నాయని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ జలాశయం నిండకపోవడానికి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అక్రమ నీటి వినియోగమే కారణమన్నారు. నల్లగొండ జిల్లావాసుల కోసమని నిర్మించిన ఎస్‌ఎల్‌బిసి ప్రస్తుతం జంటనగరవాసుల తాగునీటి అవసరాల నిమిత్తమే ఉపయోగపడుతుందన్నారు. మిగులు జలాల పేరుతో ప్రాజెక్టులు కట్టి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నికర జలాల దోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కేంద్రం ప్రత్యేకంగా నిర్ధిష్టంగా దామాషా పద్ధతిలో నీటి వినియోగం చేసినప్పుడే సమన్యాయం జరుగుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో రాజకీయ పార్టీలకతీతంగా పోరాటం సాగించకపోతే కొన్నిరోజుల్లోనే ఎడమకాల్వ పరిదిలోని నల్లగొండ జిల్లా ఎడారిగా మారనున్నదని ఆయన హెచ్చరించారు.