నల్గొండ

ఆకుపచ్చ తెలంగాణతో కరవు కాటకాలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 21: ఆకుపచ్చ తెలంగాణ సాధనతో కరవు, కాటకాలు దూరమవుతాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోరు రామన్న తెలిపారు. అందుకోసమే సిఎం కెసిఆర్ హరితహారం పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. మండలంలోని గోపలాయిపల్లిలో హరిత హారం నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకం తీరును అభినందించారు. నర్సరీలను మరింత విరివిగా ఏర్పాటు చేసి హరిత హారం లక్ష్యాల సంఖ్య మేరకు రానున్న సీజన్‌కు మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. పండ్ల మొక్కలు, నీడ మొక్కలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ సందర్భంగా విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారి వెంట గతంలో సీఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా నాటిన హరిత హారం మొక్కలను ఆయన రహదారి పలు చోట్ల ఆగి మరి పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతు తెలంగాణ అటవీ సంపద ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నందునా తరుచు వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. విస్తృతంగా మొక్కలు పెంచి వర్షాలరాకకు అనుకూలంగా మానవ ప్రయత్నం చేయాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఉమ్మడికి హరిత హారం లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. వనాల అభివృద్ధితోనే తెలంగాణ కరవు పోయి ఊళ్లలోకి వచ్చిన కోతులు తిరిగి అడవుల్లోకి వెళ్లి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత హారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. హరిత హారం, మిషన్ కాకతీయతో వర్షాలు పడి సాగునీటి వనరుల అభివృద్ధి జరిగి గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి బంగారు తెలంగాణ సాధనలో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, జడ్పీటిసి దూదిమెట్ల సత్తయ్యయాదవ్, ఆర్డీవో వెంకటాచారి, ఎంపిడివో సురేష్, తహశీల్ధార్ విజయలక్ష్మి, సర్పంచ్ అచ్చాలుగౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ ఎండి.రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కోదండరామ్ కాంగ్రెస్‌తొత్తు
* రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేల్
మోత్కూరు, ఫిబ్రవరి 21: అడ్డగూడూరు మండలంలోని చౌలరామారం గ్రామంలో పదివేల మెట్రిక్ టన్నుల గోదాం ఏర్పాటుకు 10 ఎకరాల స్థలమును మంగళవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ టిజెఎసి చైర్మన్ కోదండరామ్ కాంగ్రెస్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు కోదండరాంను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సిహెచ్ మహేంద్రనాథ్, ఎంపిపి ఓర్సు లక్ష్మీ, నాయకులు సత్యంగౌడ్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.