నల్గొండ

కంది రైతుకు గోనె సంచుల కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూర్, ఫిబ్రవరి 20: చండూరు మార్కెట్ యార్డులో హాకా ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని గత నెలలో ఏర్పాటైంది. జిల్లాలో ఒకే కొనుగోలు కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వస్తున్న ధాన్యం వాహనాలతో మార్కెట్ యార్డు కిక్కిరిసిపోతోంది. ధాన్యం తీసుకువచ్చిన రైతులకు మార్కెట్ సిబ్బంది టోకెన్లు ఇచ్చి లోపలికి అనుమతిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం తీసుకువచ్చిన ధాన్యాన్ని గోనె సంచుల కొరతతో ఇప్పటి వరకు తూకం వేయలేదు. సోమవారం భారీ స్థాయిలో ధాన్యం రావడంతో గోనె సంచులు సరిపడా లేక తప్పని పరిస్థితులలో మంగళవారం, బుధవారం కొనుగోళ్లు నిలిపివేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 15,500 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. బయట దళారులు క్వింటాలకు రూ.4200-రూ.4500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.5050 చెల్లిస్తుండడంతో మార్కెట్‌లో అమ్మకానికే రైతులు మొగ్గుచూపుతున్నారు. కాగా మార్కెట్‌లో ఇప్పటికే సుమారు 3000 క్వింటాళ్ల తూకం వేయని ధాన్యం ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సిబ్బందిని, తూకం వేసే కాంటాలను పెంచి ధాన్యాన్ని తూకం వేసిన తరువాతనే మిగతా రైతులకు టోకెన్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ రైతులకు సౌకర్యాలు మెరుగపర్చాలన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 15 రోజులలో డబ్బులు ఖాతాలో జమచేస్తామని చెబుతున్నా జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బిల్లుల చెల్లింపుల జాప్యం గురించి కొనుగోలు కేంద్రం బాధ్యుడు రాజేందర్‌ను వివరణ కోరగా సాంకేతిక సమస్యలతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోందన్నారు. బిల్లులు చెల్లింపు అయింది, లేనిది తెలుసుకోవటానికి రైతులు హైదరాబాదులోని హాకా సహాయ కేంద్రానికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.
మార్కెట్ కార్యదర్శి రఘపతి వివరణ
రైతులు ఒకేసారి రావడంతో కొనుగోలు కేంద్రంలో ఇబ్బంది తప్పటం లేదు. రద్దీని దృష్టిలో పెట్టుకొని 3 కాంటాల ద్వారా తూకం వేస్తున్నాం. రైతులు కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడకుండా త్వరితగతిన కాంటాలు పూర్తిచేస్తున్నాం. గోనె సంచుల కొరత కారణంగా కాంటాలు ఎగుమతిలో కొంత జాప్యం జరుగుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఎట్టి పరిస్థితులలో దళారుల మాటాలను నమ్మోద్దని ఆయన సూచించారు.