నల్గొండ

మొక్కల సంరక్షణపై ఇంటింటి సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, ఫిబ్రవరి 21: మొదటి, రెండో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన అన్ని మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం నకిరేకల్‌లో హరితహారంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, నర్సరీలను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి తనిఖీచేశారు. అనంతరం మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయరహదారి, గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు గ్రామానికి ఒక అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అదేవిధంగా నాటిన మొక్కల సంరక్షణపై ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. హరితహారం పథకం సిఎం కెసిఆర్ మానసపుత్రిక అని, అందువల్ల ఈ పథకానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రికార్డుస్థాయిలో మొక్కలు నాటి నాటిన ప్రతి మొక్కను బతికించేలా అన్ని వర్గాల ప్రజలతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగవర్గాలను కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. గతంలో మొక్కల సంరక్షణకు సంబంధించి హరితహార గ్రామ రక్షణ కమిటీలను వేశామని, వీటి ద్వారా ప్రతి గ్రామంలో సంబంధిత అధికారులచే సర్వే నిర్వహించి నాటిన మొక్కల్లో ఎన్ని సంరక్షించబడ్డాయో, ఎన్ని ఎండిపోయాయే తెలుసుకొని వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నర్సరీల ద్వారా ప్రజలకు మొక్కలను ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నకిరేకల్ ఇన్‌చార్జి సర్పంచ్ మంగనపల్లి రాజు, ఎంపిపి లింగాల మల్లిశ్వరీ వెంకన్న, అటవీశాఖ సిసిఎఫ్ పికె.జా, అడిషనల్ సిసిఎఫ్ ఎం.సర్‌జైన్, జిల్లా అటవీశాఖ అధికారి శాంతరాం, డివిజనల్ అధికారి సుదర్శన్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌వో ప్రసాద్, ఎఫ్‌ఎస్‌వో రాములు, ఎఫ్‌డివో వెంకటేశంతోపాటు నకిరేకల్, కేతేపల్లి ఎంపిడివోలు, ఎపివోలు పాల్గొన్నారు.

నిరుద్యోగ జెఎసి ర్యాలీపై
నిర్బంధం.. ముందస్తు అరెస్టులు
* ముందుగానే రాజధానికి చేరిన జెఎసి శ్రేణులు
* అనుమతి లేని ర్యాలీకి వెళ్లవద్దన్న ఎస్పీ

నల్లగొండ, ఫిబ్రవరి 21: రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో నేడు తెలంగాణ రాజకీయ జెఎసి తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి విద్యార్థులు, నిరుద్యోగులు తరలివెళ్లకుండా పోలీస్‌శాఖ మంగళవారం ముందస్తు అరెస్టులు చేపట్టింది. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, దేవరకొండ, చౌటుప్పల్, కోదాడ, హుజూర్‌నగర్ వంటి పట్టణాలతో పాటు మండలాల్లోని టి.జెఎసి, తెలంగాణ విద్యావంతుల వేదిక, నిరుద్యోగ జెఎసితో పాటు మద్ధతునిస్తున్న ఇతర విద్యార్థి, ప్రజాసంఘాల నాయకుల్లో పలువురిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు అరెస్టులను ఊహించిన టి.జెఎసితో పాటు మద్దతు సంఘాల నాయకులంతా ఒక రోజు ముందుగానే హైద్రాబాద్ చేరిపోయారు. టి.జెఎసి ఉమ్మడి జిల్లా నాయకులు ధర్మార్జున్, పందుల సైదులు, అంబటి నాగన్నలు తమ అనుచరులతో కలిసి ర్యాలీలో పాల్గొనేందుకు రాజధానికి చేరుకున్నారు. కాగా నల్లగొండ టివివి నాయకుడు పందుల గిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరు కూడా ర్యాలీకి వెళ్లకుండా వాహనాలను ఇవ్వకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టం చేసింది. టి.జెఎసి బుధవారం హైద్రాబాద్‌లో తలపెట్టిన నిరుద్యోగ జెఎసి నిరసన ర్యాలీకి ప్రభుత్వ అనుమతి లేదని ర్యాలీకి ఎవరు వెళ్లవద్దంటూ నల్లగొండ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ర్యాలీకి వెళ్లకుండా జిల్లాల సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులను సైతం ఏర్పాటు చేశామన్నారు. ర్యాలీకి వెళితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ర్యాలీకి వెళ్లేవారిని ముందస్తుగా అరెస్టు చేస్తామన్నారు.
కాగా టి.జెఎసి నిరుద్యోగ నిరసన ర్యాలీకి ప్రభుత్వం, పోలీస్‌శాఖ అనుమతినివ్వకపోడం, హైకోర్టు సైతం సుందరయ్య పార్కు నుండి ఇందిరాపార్కు వరకు ర్యాలీకి, సభకు అనుమతి నిరాకరించి నాగోల్ మైదానంలో మాత్రమే అనుమతించడం టి.జెఎసి వర్గాలను నిరాశపరిచింది. టి.జెఎసి హైకోర్టులో వేసిన పిటిషన్ సైతం వెనక్కి తీసుకుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ అణిచివేత వైఖరిని తిప్పికొడుతు అరెస్టులకు సిద్ధపడుతు సుందరయ్య పార్క్ నుండి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు టి.జెఎసి శ్రేణులు సన్నద్ధమవ్వగా ఈ సందర్భంగా ర్యాలీ ఎంతమేరకు శాంతియుతంగా జరుగనుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.