నల్గొండ

కొనుగోలు కష్టాల్లో కందుల రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 3: పత్తి సాగు వద్ధంటు పప్పు ధాన్యాల సాగు చేసుకోవాలంటు రాష్ట్ర ప్రభుత్వం మాట విని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల రైతులు పెద్ద ఎత్తున కందుల పంటల సాగు చేపట్టగా తీరా దిగుబడుల కొనుగోలు జరిపించడంలో ప్రభుత్వ వైఫల్యం కందుల రైతులను కష్టాల పాలు చేస్తుంది. వరుసగా గత పక్షం రోజులోగా మూడు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట కంది రైతులు రాస్తారోకోలు, ధర్నాలకు దిగడం సాధారణమైపోయింది. శుక్రవారం సైతం భువనగిరి, నల్లగొండ మార్కెట్‌లలో కందుల రైతులు ఆందోళనలకు, రాస్తారోకోలకు దిగడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. నల్లగొండలో కందుల కొనుగోలు ప్రారంభించిన మూడో రోజు కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు పక్కనే ఉన్న నల్లగొండ-హైద్రాబాద్ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. తాము నాలుగు రోజులుగా మార్కెట్‌లోనే పడిగాపులు పడుతున్నామని గన్నీ బ్యాగ్‌లు లేవంటు, తేమ అధికంగా ఉందంటు కొనుగోలు ఆపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పది రోజులు ఆరబెట్టి తీసుకొచ్చిన కందులను సైతం అధికారులు తేమసాకుతో కొనుగోలుకు నిరాకరించడం రైతుల ఆగ్రహానికి కారణమైంది. నిజానికి గన్నీ బ్యాగ్‌ల కొరతతో కొనుగోలు చేయలేక తమ వైఫల్యాలను దాటవేసేందుకు తేమసాకులు చెబుతున్నారంటు రైతులు ఆరోపించారు. ఆందోళనకు దిగిన రైతులకు పోలీసులు నచ్చచెప్పిన వినకపోవడంతో హాకా ఎండి సురేందర్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడి ఆలీమ్‌లు స్వయంగా రైతుల వద్ధకు వచ్చి సోమవారం కల్లా ఓక్కో మార్కెట్‌కు 20వేల బస్తాలిస్తామని, రెండు మూడు రోజల్లో కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహిస్తామంటు రైతులకు హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు. భువనగిరిలో కలెక్టర్ అనితారామచంద్రన్ ముందు రైతులు ధర్నా చేసి తమ సమస్యలను ఏకరవు పెట్టారు.
కొనుగోలు సమస్యలతో కంది(న) రైతుల విలవిల !
మూడు జిల్లాల్లో ఈ ఏడాది 35వేల హెక్టార్లలో కంది సాగు చేసిన రైతులకు తీరా దిగుబడుల సమయానికి కందుల ధర పడిపోవడం తొలి దెబ్బగా మారింది. గత ఏడాది క్వింటాల్ 8వేలకు పైగా పలికిన కందుల ధర ఈ సీజన్‌లో ప్రభుత్వ మద్ధతు ధర మేరకే 5050గా ఉండటం గమనార్హం. ఒక్క నల్లగొండ జిల్లా పరిధిలోనే ఈ ఏడాది 1లక్ష 27వేల క్వింటాళ్ల కందులు మార్కెట్‌కు రానుండగా ఇప్పటిదాకా కేవలం 36వేల క్వింటాల్స్ మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్, ఆలేరు, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో చండూరు, నిడమనూర్, నల్లగొండ మార్కెట్‌లలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. హాకా ఆధ్వర్యంలో కందుల కొనుగోలుకు చేసిన ఏర్పాట్లు నామమాత్రంగా మారడంతో గన్నీ బ్యాగ్‌ల కొరత, రోజుకు జిల్లా వ్యాప్తంగా కేవలం 500క్వింటాళ్ల కంటే కొనుగోలు ఎక్కువగా సాగకపోవడం వంటి సమస్యలతో కొనుగోలు కేంద్రాల్లో కందుల రాశులు, బస్తాలు పేరుకుపోతున్నాయి. నల్లగొండ జిల్లాలోని మూడు మార్కెట్‌లకు 2లక్షల గన్నీ బ్యాగ్‌లు అవసరముండగా స్వయంగా ఎండి సురేందర్‌రెడ్డినే 60వేల బస్తాలు మాత్రమే అందించగలమంటు చెప్పడం కొనుగోలు సమస్యలను వెల్లడిస్తుంది. చివరకు కొనుగోలు జరిపిన రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సైతం 48గంటల చెల్లింపు ఆచరణలో విఫలమవ్వగా 20రోజులైన రైతులకు డబ్బులు అందకపోతుండటం కంది రైతుల కష్టాలకు నిదర్శనం. ప్రభుత్వం కందుల కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామంటు చేస్తున్న ప్రకటనలకు వాస్తవంగా క్షేత్ర స్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలతో రైతులు నిత్యం ఆందోళనలకు దిగుతున్నారు. ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖలు దీనిపై తక్షణమే దృష్టి సారించి తమ మాట మేరకు పత్తిసాగు మానుకుని కంది సాగు చేపట్టిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.