నల్గొండ

అంతా కల్తీ మయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 4: పాలుకల్తీ.. నీళ్లు కల్తీ.. నూనె కల్తీ.. కల్లు కల్తీ.. మద్యం కల్తీ.. రోగాలని నివారించే మందుల్లో సైతం కల్తీ ఇలా వరుసగా జిల్లాల్లో ఆయా రంగాల్లో వెలుగుచూస్తున్న కల్తీ ఘటనలు జనాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కల్తీ నివారించే చర్యలకు కావాల్సిన అధికార యంత్రాంగం పటిష్టతపై ప్రభుత్వం నిర్లక్ష్యం కల్తీదారులకు కలిసివస్తుండగా వారికి ధనం.. జనానికి ఆనారోగ్యం దక్కుతుంది. తాజాగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రాల్లోని నూనె మిల్లుల్లో కల్తీ, నకిలీ వంట నూనెలు, కల్తీ పాలు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూడటం ఇటీవల ఆహార కల్తీ సమస్య తీవ్రతను చాటింది. నల్లగొండలో ఒక లైసెన్స్‌మిల్లుతో మరో మిల్లును సైతం నడుపుతూ బ్రాండెడ్ ఆయిల్‌తో పాటు నకిలీ పామాయిల్స్‌ను విక్రయిస్తు జనానికి యథేచ్ఛగా విక్రయిస్తుండగా టాస్క్ఫోర్సు, విజిలెన్స్ బృందాల దాడుల్లో బయటపడింది. అయితే వారిపై 6ఏ కేసుల నమోదుకే పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తుంది. బీబీనగర్, ఆలేరు, భువనగిరిలలో కల్తీ పాల దందా వెలుగుచూసింది. పరిశ్రమల వ్యర్థాలను పాడి పశువులకు పెడుతూ అధిక పాల దిగుబడి జరిపి కొందరు, యూరియా, డిటర్జంట్ ఫౌడర్స్ కలిపి మరికొందరు కల్తీ పాలను తయారుచేసి ప్రజలకు విక్రయిస్తు వారి ఆరోగ్యాలతో సొమ్ము చేసుకుంటున్న నిందితులను తాజాగా పోలీస్ శాఖ పట్టివేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇటీవల ఓ మద్యం దుకాణాన్ని కల్తీ మద్యం విక్రయ ఆరోపణలపై అధికారులు సీజ్ చేయడం మద్యం ప్రియులను భయపెట్టింది. అటు చింతపల్లి, నారాయణపూర్‌లలో కల్తీ కల్లు ఘటనలు వెలుగుచూశాయి. భువనగిరి డివిజన్‌లో నకిలీ మంచినీళ్ల సీసాల దందాను సైతం అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఇక రోగ నిరోధక మందుల్లో నకిలీ, నాసిరకం మందుల బాగోతం తరుచుగా వెలుగుచూస్తేనే ఉన్నాయి. అయితే పెద్ద మొత్తంలో సాగుతున్న కల్తీ దందాల్లో వెలుగుచూసిన ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమేకాగా వెలుగుచూడని కల్తీ వ్యాపారాలు జనం కళ్లుగప్పి యథేచ్ఛగా సాగుతునే ఉన్నాయి.
బలగం లేని కల్తీ నిరోధక శాఖ !
తెలంగాణ వ్యాప్తంగా లక్షల దుకాణాలు ఆహార సంబంధిత విక్రయాల వ్యాపారాలు సాగిస్తుండగా వాటిపై నిఘా సారించి కల్తీ నిరోధించాల్సిన ఆహార కల్తీ నిరోధక శాఖకు సంబంధించి ఫుడ్ ఇన్‌స్పెక్టర్స్ వ్యవస్థలో ఖాళీలు ఆ శాఖ దూకుడుకు కళ్లెం వేస్తున్నాయి. రాజధాని హైద్రాబాద్‌లోనే 30 ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి వుండగా కేవలం నలుగురు మాత్రమే పూర్తి స్థాయి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఆహార కల్తీ నిరోధక శాఖలోని నలుగురి ఉద్యోగులను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు పంపిణీ చేశారు. వారికి వాహన సైతం లేకపోవడం దయనీయం. మాతృ జిల్లా నల్లగొండ కల్తీ నిరోధక శాఖకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఖమ్మం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నల్లగొండ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఆయనకు తోడు కేవలం ఒక అటెండర్ ఉన్నారు. అలాగే సూర్యాపేటలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్, అటెండర్ ఉండగా, యాదాద్రిలో ఒక్క ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. నిబంధనల మేరకు ఒక్కో జిల్లాకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో సహా ఐదుగురు ఉద్యోగులు విధిగా నియమించాల్సి వుండగా ఆ పోస్టులన్ని ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. కల్తీ నిరోధక చర్యల కార్యాచరణ దిశగా మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో క్రియాశీలకంగా పనిచేసే ఆహార సలహా సంఘాల నియామకం జరుగక క్షేత్ర స్థాయిలో కల్తీ వ్యాపారాలపై ఫిర్యాదు సైతం తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ఆహార కల్తీ నిరోధక శాఖలో ఖాళీలను ప్రభుత్వం భర్తీ జనాన్ని కల్తీ పదార్థాల బారి నుండి కాపాడాలని వినియోగదారుల సంఘాలు కోరుతున్నాయి.

ఉద్యమాన్ని ముందుండి
నడిపితే అరెస్టులా?
* కోదండరాంను అరెస్ట్ చేసిన ఘనత కెసిఆర్‌దే..
* మాటలతో గారడీ చేస్తూ అభివృద్ధి అంటున్న సిఎం
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

మిర్యాలగూడ, మార్చి 4: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరామ్‌ను అరెస్ట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్ర శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ మాటలతో గారడీ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఇదే అభివృద్ధి అని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో సిఎం చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 93శాతం ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే పాదయాత్రను చేపట్టినట్లు ఆయన తెలిపారు. మహాజన పాదయాత్రను అడ్డుకోవాలని కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావులు అన్నారని, అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధిని కాంక్షించే పార్టీ సిపిఎం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చించేందుకు సమయం ఇచ్చి తప్పుకున్నారని, దమ్ముంటే చర్చలకు రావాలని ఆయన అన్నారు. ఎర్రజెండాతో అభివృద్ధిపై చర్చించేందుకు దమ్ములేకనే టిఆర్‌ఎస్ రాలేదని ఆయన అన్నారు. అభివృద్ధి అంటే సాధారణ ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చినప్పుడే అభివృద్ధి అని ఆయన అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం పాదయాత్రలు చేయడంలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పి రాష్ట్రం ఏర్పడిన తరువాత 5వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ఆయన అన్నారు. హామీలు ఇవ్వడం, వాటిని విస్మరించడం సిఎంకు అలవాటని.. మాటతప్పి, మడమ తిప్పే అలవాటు సిపిఎంకు లేదని అన్నారు. దేవుళ్ల మొక్కులను తీర్చకపోతే దేవుడు ఊరుకోడన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన మొక్కులను కూడా తీర్చకపోతే ముఖ్యమంత్రికి ముక్కుతాడు వేస్తామని ఆయన అన్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు నష్టపోతే ఒక్క పైసా కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వని రాష్ట్రం.. దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్టమ్రేనని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించారని ఆయన విమర్శించారు.

భక్త్భివం పెంపోందించేందుకు ధార్మిక సభలు
* యాదాద్రి ఈఓ ఎన్.గీత
యాదగిరిగుట్ట, మార్చి 4: భక్త్భివం పెంపొందించేందుకు ధార్మిక, సంగీత, సాహిత్య, నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత అన్నారు. శనివారం యాదాద్రి కొండపైన చైర్మన్ నర్సింహమూర్తి ఈఓ, ధార్మిక సభలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భక్తి రసాన్ని సమాజంలో పెంపొందింపజేయడానికి పాటు పడుతున్నామన్నారు. భగవంతుని నామకీర్తన సంకీర్తన గొప్పతనాన్ని భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. చైర్మన్ నర్సింహమూర్తి మాట్లాడుతూ సంగీత సభలు భక్తులను ఆనందింప జేస్తాయని భగవంతుని లీలలను కథల ద్వారా సంగీతం ద్వారా ఆలపించే ఏర్పాటు జరిగిందని తెలిపారు. బాపట్ల లక్ష్మికాంతయ్య ఆద్యుడిగా ఈ క్షేత్రంలో 200 సంవత్సరాల పూర్వము నుండే భక్తకోటి ఈ క్షేత్రంలో భగవన్నామ సంకీర్తన భజనలు నిర్వహించినట్లు ఎన్నో దృష్టాంతముల ద్వారా తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

గోవర్ధనగిరి ధారి అలంకారంలో నృసింహుడు
యాదగిరిగుట్ట, మార్చి 4: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో వారం రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు శనివారం గోవర్ధనగిరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నందవ్రజంలో కృష్ణ్భగవానుడు బాలుడిగా భక్తరక్షనార్థం గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుపై ఏడు రోజులు ధరించి రక్షించుట ఇంద్రాది దేవతల గర్వాన్ని అనచుట ఈ అలంకార ప్రత్యేకత అని ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనర్సింహాచార్యులు, కారంపూడి నర్సింహా చార్యులు అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వారి ఆలయంలో ఉదయం శ్రీ వైష్ణవ సేవాసమాఖ్య వారిచే ప్రభాతభేరి, విష్ణు సహస్రనామాలతో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా వేదపారాణములు, నిత్యహవనములు, పంచసూక్త పఠనములు, మూల మంత్రజపములు, చతుర్వేద పారాణములు పారాయణీకులచే ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి సింహ వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువు అవతరించిన శ్రీ నృసింహ అవతారంలో అత్యంత శ్రేష్టమైన సింహకృతిని శిరస్సుగా నరుని ఆకృతిని దేహముగా స్వీకరించుట ఈ రెండింటిలో శిరస్థానం శ్రేష్ట్భాగము సింహం, అని సింహం అవున్నత్యము తెలియబడుతుందని ఆచార్యులు చెప్పారు. సింహము కోప చటులతకు శౌర్య స్పోరకమునకు గాంభీర్య ప్రదర్శనకు ఇంద్రియ నిగ్రహమునకు మరి ఎన్నింటికో ప్రతీకగా నిలిచిందని, జగద్రక్షకుడైన స్వామి వారు కేవలం క్రౌర్య, శౌర్య, పరాక్రములనే ప్రతీకగా గాక సర్వజన రక్షకుడిగా భక్తులను రక్షించుట ఈ అలంకార విశిష్టత అని ఆచార్యులు తెలిపారు. ఈ సందర్బంగా స్వామి వారిని పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, రక రకాల పూలమాలలతో అత్యంత సుందరంగా అలంకరించి వేదమంత్రాలు, కీర్తనలు, బాజాబజంత్రిలతో భక్తజనులు, అర్చక బృంధం వెంటరాగా బాలాలయంలోని వీధుల్లో ఊరేగించారు. అర్చక బృందం నిర్వహించగా కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత, చైర్మన్ నర్సింహమూర్తి, ఏఈఓలు ఆకునూరి చంద్రశేఖర్, భాస్కర్‌శర్మ, వేముల రామ్మోహన్, భక్తులు పాల్గొన్నారు.

నల్లగొండ పర్యాటక ప్రాంతాల అభివృద్దికి సహకారం
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తుశాఖ కార్యదర్శి బుర్రా
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, మార్చి 4: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పర్యాటక, చారిత్రాక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. శనివారం నల్లగొండ పానగల్ చారిత్రాక ఛాయ, పచ్చల సోమేశ్వర ఆలయాలను, పానగల్ పురావస్తు మ్యూజియంను, ఉదయ సముద్రం రిజర్వాయర్‌ను సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి శిథిలయాల నిర్మాణ విశిష్టత, శిల్ప సంపద విశేషాలను పరిశీలించారు. ఛాయ సోమేశ్వర ఆలయంపై శివలింగంపై నిరంతరం నిశ్చల నీడ విశిష్టతపై పరిశోధనలకై యూనివర్సిటీ, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటుచేయలన్నారు. భౌతిక శాస్త్ర ప్రొఫెసర్లతో పరిశోధన సదస్సులు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. పానగల్ ఉత్సవాల నిర్వాహణకు ప్రతిపాదనలివ్వాలని ఇటువంటి ఉత్సవాలతో పర్యాటక ప్రాంతాలకు తగిన ప్రచారం లభించి పర్యాటకులను ఆకర్షించవచ్చని తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడుతాయన్నారు. జిల్లా పర్యాటక, చారిత్రాక ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో కూడిన కార్యచరణను సమర్పించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు సూచించారు. జిల్లా పర్యాటకరంగా అభివృద్ధికి పర్యాటక ప్రమోషన్ కమిటీలను నియమించి ఇతర రాష్ట్రాలకు అవగాహానకై పంపించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి విద్యార్థుల విహార యాత్రలు ఏర్పాటు చేయడం, పర్యాటకులకు వసతులు కల్పించడంతో పర్యాటకుల సంఖ్య పెంచే చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిచి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేవరకొండ, నాగార్జున సాగర్‌లో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్దికి అన్ని మార్గాలను ఆనే్వషించి పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశానికి పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉన్నందునా తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్నారు.
జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతు జిల్లాలోని పానగల్, దేవరకొండ, సాగర్, నల్లగొండ ప్రాంతాల్లోని అన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధుల అంచనాలను ప్రతిపాదించామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి ఎం.శివాజీ, దేవాదాయశాఖ ఏసి సులోఛన, మున్సిపల్ కమిషనర్ రాజ్‌కుమార్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ నర్సింహ్మ, డిఎస్‌డివో మక్భుల్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఈ ముజిబుద్ధిన్, ఆర్డీవోలు వెంకటాచారి, లింగ్యానాయక్, కిషన్, పానగల్ ఆలయ నిర్వాహకులు గంట్ల అనంతరెడ్డి, కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కళలతో కూడిన విద్య అవసరం: డిఇవో
నల్లగొండ రూరల్, మార్చి 4: విద్యార్థులకు కళలతో కూడిన విద్య అవసరమని తద్వారా విద్యార్థిలో జ్ఞాన సముపార్జన కలుగుతుందని డిఇవో చంద్రమోహన్ అన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ల ఫెడరేఫన్ ఆధ్వర్యంలో కళలతో కూడిన విద్య అవసరమనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్యాలరీని ఆయన తిలకించారు. ఈసందర్భంగా డిఇవోమాట్లాడుతూ ఆయా పాఠశాలల్లో డ్రాయింగ్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల సేవలు విద్యార్థులకు ఎంతో అవసరమన్నారు. అనంతరం ఆ సంఘం నాయకులు గౌరవ అధ్యక్షులు ఉపేంద్ర చారి, పోతరాజు వౌనికలు మాట్లాడుతూ 2012లో సర్వశిక్ష అభియాన్ ద్వారా నియామితులయ్యామని రూ.6000 వేతనంతో కాలం వెల్లదీస్తున్నామని, ఉద్యోగ భద్రత కల్పించి 18వేల జీతాన్ని అందజేయాలన్నారు.

మహాజన పాదయాత్ర సభ నిర్వాహకులపై కేసు
మిర్యాలగూడ టౌన్, మార్చి 4: మిర్యాలగూడ పట్టణంలో అనుమతి లేకుండా మహాజన పాదయాత్ర సభను రోడ్డుపై శనివారం నాడు నిర్వహించారన్న ఆరోపణలపై సిపిఎం నాయకులు 15 మందిపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ సాయిఈశ్వర్‌గౌడ్ అన్నారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణా కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహాజన పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడకు పాదయాత్ర వేలాది మందితో చేరుకొనగా మద్యాహ్నం సుమారు 1 గంట నుండి 2.30 గంటల వరకు సభను స్థానిక మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా అంబేద్కర్ టూ వే రోడ్డుపై ఒక వైపు రోడ్డు మీద సభా వేదిక ఏర్పాటు చేసి సభ నిర్వహించారు. సభ నిర్వహణకు తాము అనుమతి ఇవ్వకున్నా సభ నిర్వహించారన్న ఆరోపణలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.మల్లేష్, పట్టణ కార్యదర్శి జగదీష్‌చంద్ర మరో 12 మందిపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. సెక్షన్ 290, న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు.

సంక్షేమ పథకాలు పేదలకు అందాలి
* ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి
తుర్కపల్లి, మార్చి 4: ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు గ్రామాలలో నిరుపేదలకు అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బత్తాయిపల్లి, ఇబ్రహీపురం, గంధమల్ల, గోపాలపురం, లక్ష్మాపురం, నాగాపురం, దేవోజి తండా, గొల్లగూడం గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. ఇంటింటికి రక్షిత జలాలు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. అదేవిధంగా సాగు జలాలు అందించేందుకు ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామన్నారు. గ్రామాలను అంచెల వారిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి బబ్బూరి రవీంద్రనాథ్ గౌడ్, తహశీల్దార్ నాగలక్ష్మీ, ఎంపిడివో జలేందర్ రెడ్డి, జడ్పీటిసి గోరేటి జ్యోతి, అయోద్‌ధ్య రెడ్డి, వైస్ ఎంపిపి ఉమారాణి, ఎంపిటిసి సభ్యులు తలారి శ్రీను, అరుణ, భాగ్యమ్మ, రాజయ్య, రఘురాం, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పడాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
* ఎమ్మెల్సీ పూల రవీందర్
చింతపల్లి, మార్చి 4, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మండలంలోని గౌరారం, కుర్మేడ్ మాల్, చింతపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఆయన ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కె జనార్ధన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. అంతకు ముందు స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం, కార్యదర్శి కోమటిరెడ్డి నర్సింహా రెడ్డి, ఎంఇవో కేశగోని సత్తయ్య, మండల పిఆర్‌టియు అధ్యక్షుడు సుధీర్, శివరంగాచారి, సుధాకర్ రెడ్డి, పుల్లారెడ్డి, హెడ్ మాస్టర్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.