నల్గొండ

బిజెపి బలోపేతానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, మార్చి 5: పార్టీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలందరు కృషి చేయాలని 2019లో సాదారణ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి మైనార్టీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె బాబా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యకార్తకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోరి రాజుపేట గ్రామపంచాయతీకి చెందిన 25 కుటుంబాలు స్వచ్ఛందంగా బిజెపి పార్టీలో చేరారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాలు పరిపాలనలో ఇప్పటివరకు యువతకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, రైతులకు ఈ రోజు వరకు కూడా పూర్తిగా రుణమాఫీ అమలు చేయలేదని, ని రుపేదలకు పక్కా నిర్మాణాలను చేపడుతామని చెప్పి ఇప్పటివరకు కూడా మాటలకే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు డబుల్ బెడ్‌రూంలు ఇస్తామని చెప్పి పూర్తి చేయలేదని, తన నియోజకవర్గమైన గద్వేల్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదలైన నిధులతో మాత్రమే నిర్మాణం చేశాడే తప్పా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మాటలే తప్ప చేతలులేవన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పల్లె ప్రకాశ్, పల్లె కృష్ణచ ఆలకుంట్ల కిరణ్, వంగూరి రవి, సుంకిశాల జాని, నాగార్జునా, నాగరాజు, పరుశరాములు, గోపి, శంకర్, సైదులు, యల్లయ్య, శివ, రామలింగయ్య, మహేష్, సతీష్, పాల్గొన్నారు.

పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
తుర్కపల్లి, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడి దిష్టిబొమ్మను ధగ్దం చేశారు. ఈసందర్భంగా చేపట్టిన రాస్తారోకోలో ఎంపిపి బబ్బూరి రవీంద్రనాథ్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల కేంద్రంలో మోడీ ప్రభుత్వం పేదల నడ్డి విరిచేందుకు వంటగ్యాస్ ధరలను 90 రూపాయలు దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎ సు ధాకర్, మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎ వెంకటేశ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ యాదవ్, నాయకులు భిక్షు నాయక్, కిషన్ నాయక్, రాజు నాయక్, శ్రీశైలం యాదవ్, ఎం మహేష్, శ్రీకాంత్, వినోద్, వెంకటేశ్ నాయక్, రమేష్, రాజాలింగం, అమరేందర్, కనకరాజు, బాలకృష్ణ, నర్సింహులు, కర్నాకర్ పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్షాకాలం

వలిగొండ, మార్చి 5: ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షాకాలం నడుస్తుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ థియరీ వార్షిక పరీక్షలు, డిగ్రీ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ఈనెల 28 నుండి డిగ్రీ వార్షిక పరీక్షలు కూ డా ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఈనెల 7 నుండి ఒ కటి నుండి తొమ్మిదో తరగతి పరీక్షలు, 14వ తేదీ నుండి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వెంటనే మార్చి 21 నుండి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కా నుండడంతో ఈఏండాకాలం విద్యార్థులకు పరీక్షాకాలంగా మారిందని చెప్పవచ్చు. ఐఏసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ తరహా రాష్ట్రంలో 2017-18 కొత్త విద్యాసంవత్సరం వేసవి సెలవులకు నెల ముందుగానే ప్రారంభించనున్నారు. గత సంవత్సరం అమలు చేయాలని చూసినప్పటికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో అమలు కాలేదు. అ యితే ఈ సంవత్సరం ముందుగానే పుస్తకాలను పంపించి తరగతులను ప్రారంభించేందుకై చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఎండలు అప్పుడే మండుతుండడంతో పదవ తరగతి పరీక్షలు అనంతరం మధ్యాహ్నం పాఠశాలలు నిర్వహించాల్సి ఉండడంతో ఎండలతో విద్యార్థులు మండే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండడంతో విద్యార్థులకు అటు పరీక్షలతోనే కాకుండా మండే ఎండలతో కూడా పరీక్షాకాలం ఎదురుకానుంది.