నల్గొండ

సాఫ్ట్‌వేర్ కేటుగాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మార్చి 7: ఇంజనీరింగ్ చదివి.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సైతం పెట్టి అప్పుల పాలై దొంగతనాలకు అలవాటుపడ్డాడీ కేటుగాడు. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవిన ఈ ప్రబుద్ధుడు అప్పుల ఊబీలో కూరుకుపోయ చోరీలకు అలవాటుపడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటలపాలయ్యాడు. నల్లగొండ జిల్లా పోలీసులు అతడిని అరెస్టు చేసి నిందితుడి వద్ద నుండి 9 లక్షల చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నారు. మంగళవారం నల్లగొండ ఎస్పీ ఎన్ ప్రకాశ్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. పొరుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రెడ్డిపాలెంకు చెందిన నడింపల్లి వెంకట వినయ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. ఆపై సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి దాని నిర్వాహణతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో నిందితుడు వెంకట వినయ్ చోరీల వైపునకు మళ్లాడు. ఇలా 2015 నుండి దొంగతనాలు చేస్తున్న ఇతగాడిపై ఇప్పటివరకు 12 చోరీ కేసులు నమోదయ్యాయి. అంతేగాక వెంకటవినయ్ విజయవాడ, రాజమండ్రిల్లో సైతం పలు చోరీలకు పాల్పడ్డాడు. ఈక్రమంలో పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు. రెండు నెలల ముందే విజయవాడ జైలు నుండి విడుదలైన వెంకట వినయ్ మళ్లీ దొంగతనాలు కొనసాగించాడు. గత రెండు నెలల్లో నాలుగిళ్లలో చోరీ చేశాడు. రాత్రి వేళల్లో కార్లలో తిరుగుతూ రాడ్‌లతో తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడేవాడని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ విటీ కాలనీలో గత నెలలో నాలుగిండ్లలో చోరీ చేశాడని, సిసి కెమెరాల ఫుటెజీల ఆధారంగా నిందితుడిని గాలింపు చేపట్టామన్నారు. ఈ క్రమంలో మంగళవారం వెంకట వినయ్ కాలనీల్లో సంచరిస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా రాడ్‌లు, విలువైన వస్తువులు లభించాయి. దీంతో వినయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌లో తమదైన శైలిలో విచారించగా నిందితుడు తన దొంగతనాల చిట్టా విప్పాడు. నిందితుడు వెంకట వినయ్ నుండి 7 తులాల బంగారం, తులం వెండి, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు కెమెరాలు, ప్రింటర్, ట్యాబ్, సెల్‌ఫోన్ మొత్తం తొమ్మిది లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. ఇలా ఉండగా నిందితుడు మరో 18 తులాల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువ బెట్టినట్లుగా విచారణలో వెల్లడించాడని తెలిపారు. ఈ మేరకు వెంకటవినయ్‌పై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లుగా ఎస్పీ చెప్పారు.

బీబీనగర్ మండలంలో వడగళ్ల వర్షం
బీబీనగర్, మార్చి 7: బీబీనగర్ మండలంలోని జమీలాపేట, రాయరావుపేట, కొండమడుగు, నెమరగొమర గ్రామాల్లో మంగళవారం భారీ రాళ్ల వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు భారీ వడగండ్లు పడడంతో రాయరావుపేట, జమీలాపేట గ్రామాల్లో వరిచేనులకు నష్టం వాటిల్లింది.

దివ్య విమానరథంపై నారసింహుడు
యాదగిరిగుట్ట, మార్చి 7: లోక కల్యాణ కోసం తిరు కల్యాణ మహోత్సవం జరుపుకున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తీర్థజనుల కనువిందు కోసం మంగళవారం రాత్రి దివ్య విమాన రథంపై విహరించారు. కొండపైన బాలాలయం, కొండకింద వైకుంఠద్వారం నుండి ప్రధాన వీధిలో భక్తుల దర్శనార్థం ప్రచార రథోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విమాన రథాన్ని రంగు రంగుల విద్యుత్‌ద్దీపాలు రక రకాల పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నవ వధూవరులైన శ్రీ లక్ష్మీనర్సింహులను పట్టు పీతాంబరాలు, బంగారు వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలతో అలంకరించి స్వామి వారిని అమ్మవారిని రథంపై అర్చకులు అధిష్ఠించి రథాంగ హోమం నిర్వహించారు. వేదమంత్రాలు, బాజాభజంత్రీలు, సన్నాయి మేళాలు, కోలాట నృత్యాలు, మార్మోగుతుండగా రథోత్సవం ప్రారంభమైంది. దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత, చైర్మన్ బి.నర్సింహమూర్తి చేరో పక్క చేరి రథ చక్రాలను కదిలించడంతో రథయాత్ర మొదలైంది. వేలాది మంది భక్తులు రథపగ్గాలు లాగడానికి పోటీలు పడ్డారు. యాదాద్రి గోవింద నామస్మరణతో మార్మోగింది. బాణాసంచాలు కాలుస్తూ.. భజనలు చేస్తూ.. కోలాట నృత్యాలతోసాగింది. భక్తులు రథ దర్శనం చేసుకొని పుణీతులయ్యారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భువనగిరి డిఎస్పీ మోహన్‌రెడ్డి, గుట్ట సిఐ రఘువీర్ రెడ్డి, నేతృత్వంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
గుట్టలో నేడు..
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుదవారం కొండపైన ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్ధము,రాత్రి శ్రీ పుష్పయాగము, దేవతోద్వాసన, దోపు ఉత్సవము కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రైతు ఆత్మహత్య
నల్లగొండ రూరల్, మార్చి 7: మండలంలోని నర్సింగ్‌భట్ల గ్రామంలో అప్పుల బాధతో రైతు తిరుమల వెంకన్న(45) మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున పురుగులమందు తాను చనిపోతున్నట్లుగా తన తండ్రి తిరుమల రామచంద్రాన్ని నిద్ర నుండి లేపి చెప్పాడు. వెంటనే వెంకన్నను కుటుంబ సభ్యులు 108 ద్వారా ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే వెంకన్న మృతి చెందాడు. వెంకన్న తనకున్న మూడెకరాల పొలంతో పాటు నాలుగు ఎకరాల కౌలు భూమిలో పత్తి పంట సాగు నష్టాల పాలవ్వడంతో 8లక్షలకు పైగా అప్పు మీద పడింది. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించక నిరాశతో వెంకన్న ఆత్మహత్య చేసుకున్నట్లుగా తండ్రి అందించిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రూరల్ ఎస్‌ఐ మోతిరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.