నల్గొండ

డిసిసిబి సమావేశంపై వీడని పీటముడి !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 9: అనూహ్య వివాదాలు..పరిణామాల పిదప ఎట్టకేలకు గురువారం చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అధ్యక్షతన నిర్వహించిన నల్లగొండ కేంద్ర సహకార బ్యాంకు(డిసిసిబి) పాలకవర్గం సమావేశం మరోసారి కోరం లేక వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ఎజెండా మేరకు చైర్మన్ పాండురంగారావు తన మద్ధతుదారులైన డైరక్టర్లతో కలిసి సమావేశ మందిరానికి చేరుకున్నారు. మొత్తం 20మంది సభ్యులకుగాను 9మంది మాత్రమే హాజరుకావడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేయాల్సివచ్చింది. దీంతో చైర్మన్ పాండురంగారావు, సిఈవో మదన్‌మోహన్‌లు సమావేశాన్ని వాయిదా వేశారు. కాపుగల్లు సహకార సంఘం చైర్మన్‌గా అక్రమాలకు పాల్పడిన కేసులో హైకోర్టు పాండురంగారావును సొసైటీ చైర్మన్‌గా తొలగిస్తు ఉత్తర్వులు ఇచ్చినందునా ఆయన డిసిసిబికి చైర్మన్‌గా అనర్హుడంటు వ్యతిరేక వర్గం డైరక్టర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. పాలకవర్గం సమావేశం సందర్భంగా రెండు వర్గాల డైరక్టర్ల మధ్య రచ్చకు అవకాశముండటంతో డిసిసిబి వద్ధ ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశం వాయిదాతో డిసిసిబి పరిపాలనకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలపై మళ్లీ అనిశ్చితి కొనసాగుతుంది. పాలకవర్గం వివాదంతో ఇప్పటికే వందేళ్ల పండుగ జరుపుకోనున్న డిసిసిబి బ్యాంకు అంతర్గత పాలన గాడితప్పుతుండటం, సొసైటీలకు నిధుల విడుదల సాగకపోవడం ఆందోళనకరంగా మారింది.
వారు రైతు వ్యతిరేకులు: పాండురంగారావు ధ్వజం
కాపుగల్లు సొసైటీ చైర్మన్‌గా తిరిగి తాను బాధ్యతలు చేపట్టినందునా ఆర్‌సిఎస్ ఆదేశాల మేరకు తాను డిసిసిబి చైర్మన్‌గా పాలకవర్గం సమావేశాన్ని నిర్వహించానని పలువురు డైరక్టర్లు గైర్హాజరై రైతు వ్యతిరేకులుగా వ్యవహరించడం సమంజసంగా లేదంటు పాండురంగారావు మండిపడ్డారు. కోరం లేక డిసిసిబి పాలకవర్గం సమావేశం వాయిదా వేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు డిసిసిబిని వేదికగా చేసుకుని తన వ్యతిరేక వర్గం సాగిస్తున్న స్వార్ధపూరిత పదవీ రాజకీయాల క్రీడ అటు రైతులకు, ఇటు బ్యాంకు పురోగతికి, సొసైటీలకు నష్టదాయకంగా మారిందన్నారు. మళ్లీ సమావేశాన్ని త్వరలోనే నిర్ణయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా డిసిసిబి పరిధిలోని 40సహకార సంఘాల చైర్మన్లు సైతం గురువారం బ్యాంకుకు చేరుకుని మరోసారి పాలకవర్గం సమావేశం వాయిదా పడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీలకు నిధుల విడుదల, పరిపాలన అంశాలపై తీర్మానాలు చేయకుండా పాలకవర్గం సమావేశం వాయిదా పడేలా చేసిన డైరక్టర్లు రైతు వ్యతిరేకులు మిగిలిపోతారని వచ్చే ఎన్నికల్లో వారు మళ్లీ గెలువబోరంటు విమర్శించారు.

ఔరవాణిలో టిఆర్‌ఎస్ ఘన విజయం
నార్కట్‌పల్లి, మార్చి 9: మండలంలోని ఔరవాణి ఎంపిటిసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఈదయ్యపై 206 ఓట్ల తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ముప్పిడి ఎల్లయ్య విజయం సాధించారు. మొత్తం 1806 ఓట్లకును 1574 ఓట్లు పోలవ్వగా ఈదయ్యకు 494, ఎల్లయ్యకు 700ఓట్లు వచ్చాయి. సిపిఎం అభ్యర్థి చెర్కుపల్లి చంద్రయ్యకు 343ఓట్లు రాగా సిపిఎం తన సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకుని మూడో స్థానానికి పరితమతమైంది. ఔరవాణి ఎంపిటిసిగా టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడంతో స్థానిక టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిష్టను పెంచింది. ఫలితాల అనంతరం టిఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే వీరేశం గెలిచిన ఎల్లయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, వైస్ ఎంపిపి పద్మ ముత్తయ్య, మండల పార్టీ అధ్యక్షులు రహీంఖాన్, పట్టణాధ్యక్షుడు దేవేందర్, నాయకులు సత్తయ్య, దాసరి శ్రీను, అహ్మద్ పటేల్, వెముల నరసింహ తదితరులు ఉన్నారు.