నల్గొండ

ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి డిబార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, మార్చి 11: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ప్రైవేట్ పాఠశఋ౎లకు చెందిన విద్యార్థి డిబార్ అయ్యారని ప్రిన్సిపాల్ రాం శెట్టి తెలిపారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా స్పెషల్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలో పట్టుకొని డిబార్ చేసినట్లు తెలిపారు.

లాడ్జీలపై ఎస్‌వోటీ దాడులు
* 20 అక్రమ జంటల అరెస్ట్
భువనగిరి, మార్చి 11: రాచకొండ ఎస్‌వోటీ పోలీసు బృందాలు శనివారం యాదాద్రి, భువనగిరిలోని పరిధిలోని పలు లాడ్జీలపై ఆకస్మీక దాడులు, సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 లాడ్జీలలో తనిఖీలు చేయగా 20 అక్రమ జంటలు పట్టుబడగా వారిని యాదాద్రి, భువనగిరి రూరల్ స్టేషన్‌లకు తరలించారు. ఎస్‌వోటీ సిఐ నర్సింగరావు, ఎస్సై నవీన్ కుమార్‌ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

తాటిచెట్టుపై నుండి కింద పడి
గీత కార్మికుడు దుర్మరణం
దేవరకొండ, మార్చి 11: తాటిచెట్టుపై నుండి కింద పడి శ్యామల చిన్నకృష్ణయ్య (35) అనే గీతకార్మికుడు దుర్మరణం చెందిన సంఘటన శనివారం దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్యామల చిన్నకృష్ణయ్య రోజు మాదిరిగానే ఉదయం ఇంటి నుండి వెళ్ళి తాటిచెట్ల వద్ద మోకును ధరించి తాటిచెట్టుపైకి ఎక్కాడు. ఒక్క సారిగా మోకుకు ఉన్న ముడి జారడంతో దాదాపు 40 అడుగుల ఎత్తు ఉన్న చెట్టుపై నుండి చిన్న కృష్ణయ్య జారి కిందపడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు వచ్చి చిన్నకృష్ణయ్యను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసే లోపే చిన్నకృష్ణయ్య మృతి చెందాడు. మృతునికి భార్య హేమలత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్‌లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.