నల్గొండ

యువత అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మార్చి 21: యువత అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలను తీసుకొస్తుందని నెహ్రు యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్ అన్నారు. మంగళవారం జిల్లా నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో టౌన్‌హల్‌లో నిర్వహించిన జిల్లా యువజన సంఘాల సదస్సును ఆయన ప్రారంభించా మాట్లాడారు. యువత వివేకానంద ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి, సామాజి సేవా కార్యక్రమాల నిర్వహణకు దేశభక్తితో ముందుకుసాగాలన్నారు. జాతీయ నాయకుల త్యాగాలు, పోరాటాలు, వారి దేశానికి చేసిన సేవలను స్మరిస్తు స్ఫూర్తితో దేశప్రగతిలో భాగస్వాములుకావాలన్నారు. దేశంలో యువత ప్రగతికి 15లక్షల విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. 45వేల కోట్లతో 750అంశాలలో దేశ వ్యాప్తంగా సాంకేతిక నైపుణ్యంలో, ఉపాధిలో శిక్షణ కార్యక్రమాలు అందిస్తుందన్నారు. క్రీడలు, యువజన సర్వీస్‌ల విస్తరణకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల అండతో యువత ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు. స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియాలో తొలిసారిగా తెలంగాణ నుండి గుత్తా జ్వాల, నారంగ్, అప్పారావులకు స్థానం కల్పించారన్నారు. రాబోయే రెండు నెలల్లో నెహ్రుయువకేంద్రాల్నో ఖాళీల భర్తీకి 300పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ పొందిన, ఉత్తమ సేవలందించిన యువజన సంఘాలకు అవార్డులు, జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకంలో కృషి చేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహిత ధర్వేల్లి రామయ్య, జానమ్మ దంపతులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, రైల్వేబోర్డు మెంబర్ వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు రావుల శ్రీనివాస్‌రెడ్డి, నెహ్రుయువకేంద్రం అధికారులు గోవర్ధన్, వెంకటేశం, శేఖర్‌బాబు,తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం
మేళ్లచెర్వు, మార్చి 21: మండలకేంద్రంలోని మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో శ్రీదేవిభూదేవి సమేత శ్రీకల్యాణం వెంకటేశ్వరస్వామి వారి బ్రహోత్సవాల సందర్భంగా మంగళవారం వెంకటేశ్వరస్వామి కల్యాణం మహోత్సవం అత్యంత ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా కల్యాణంతంతు నిర్వహించారు. మైహోమ్స్ సిమెంట్ పరిశ్రమల అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుశ్రీకుమారి దంపతులు స్వామివారికి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. వెంకటేశ్వరస్వామి వారిని పెండ్లి కుమారునిగా శ్రీదేవిభూదేవి అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా పట్టువస్త్రాలతో అలంకరించి జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కల్యాణం ఘట్టాలను వందలాది మంది భక్తుల సమక్షంలో వేదపండితులైన బ్రాహ్మనోత్తములచే ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం ఘట్టాలను కండ్లకు కట్టినట్లుగా జీయర్‌స్వామి భక్తులకు ప్రవచించారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగాధి క్యాలెండర్‌ను జీయర్‌స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించి మొదటి క్యాలెండర్‌ను రామేశ్వర్‌రావు దంపతులకు అందజేశారు. ఈ కల్యాణం కార్యక్రమంలో అహోబలి రామానుజ జీయర్‌స్వామి, రంగనాథ బట్టాచార్యులు, ముడుంబై శ్రీమన్నారాయణాచార్యులు, మైహోమ్ డైరెక్టర్ వినోద్‌రావు, రంజిత్‌రావు, రామురావు, శ్యామ్‌రావు, జనరల్ మేనేజర్ మునగాల రాంమోహన్‌రావు, తెలంగాణ వై ఎస్సార్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.