నల్గొండ

నీటి పొదుపు జీవితాలకు మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, ఏప్రిల్ 17: నీటిని పొదుపుచేసే ఇంకుడు గుంతలు లేని ఇంటిని వెలివేయాలని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలపరిధిలోని కోడూరు గ్రామంలో కాటమయ్య పండుగ ఉత్సవం పాల్గొని అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూగర్భ జలవనరులు పూర్తిగా అడుగంటిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం నీటియుద్దాలు చేస్తున్నారన్నారు. నీటిని సక్రమంగా వాడుకొని నీటి కరవును అధిగమించాలన్నారు. ప్రతి ఒక్కరు 90శాతం నీటిని ఇంకుడు గుంతల ద్వారా పొదుపు చేయాలన్నారు. ఇప్పటి నుంచి నీటి పొదుపు చేస్తే భవిష్యత్తులో మండలం కరవు రహిత మండలంగా ఉంటుందన్నారు. మహారాష్టల్రోని లాతూరు, రాజస్థాన్‌లో రైలు ద్వారా నీటిని సరఫరా చేసి పోలీసులు ప్రహారాలో పంపిణి చేస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితిలో తెలంగాణలో రాకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు నీటి పొదుపు చేపట్టాలన్నారు. కేసిఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో నీటికరవు లేకుండా కలెక్టర్లకు పూర్తి స్వచ్చ ఇచ్చినట్లు తెలిపారు. వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గానికి రెండు ప్రధాన రహదారులు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. తిరువంచి నుండి రేణిగుంట వరకు, సిరిసిల్ల నుండి సూర్యాపేట వరకు రెండు జాతీయ రహదారులు తుంగతుర్తి నియోజకవర్గం నుండి వెల్లడంతో ఇక్కడి భూములకు మంచి రేటు వస్తుందని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుండి సూర్యాపేట-నల్లగొండ వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎస్సి సెల్ నాయకుడు మందుల సామేల్, ఎంపిపి దావుల మనీషా, జెడ్పిటిసి సందా అమల, టిఆర్‌ఎస్ నాయకులు అంబయ్య, గంగయ్య, వెంకటయ్య, వెంకటనారాయణ, శ్రీనివాస్‌గౌడ్, సోమేష్‌కుమార్ పాల్గొన్నారు.