నల్గొండ

4వేల హెక్టార్లలో పట్టు పరిశ్రమకు డ్రిప్ పరికరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, మార్చి 25: పట్టు పరిశ్రమ పెంపకం కోసం సూక్ష్మనీటిపారుల పథకం ద్వారా రైతులకు 4వేల హెక్టార్లలో డ్రిప్ పరికరాలను మంజూరు చేయనున్నామని ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ కమిషనర్ ఎల్. వెంకటరామిరెడ్డి అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి శివారులో రైతు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన పట్టుసంవర్ధక క్షేత్రంను కమిషనర్ వెంకటరామిరెడ్డి, అధికారులు అరుణ, మధుసూధన్‌లతో కలిసి సందర్శించి పరిశీలించారు. మల్బరీతోట సాగు పట్టుపరిశ్రమ పెంపకంను పరిశీలించి రైతు శ్రీనివాస్‌రెడ్డితో చర్చించారు. సాగు పెంపకం గురంచి రైతును అడిగి తెలుసుకుని తీసుకోవాల్సిన సలహా సూచనలను తెలియజేశారు.
క్షేత్రాన్ని కలియ తిరిగిన అధికారులు సంతృప్తిని వ్యక్తం చేసి రైతును అభినందించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పట్టు పరిశ్రమ కోసం ప్రభుత్వం రైతులకు ప్రోత్సహాన్ని అందిస్తోందన్నారు. కార్యక్రమంలో అధికారులు అశోక్‌కుమార్, మదన్‌మోహన్, చిట్యాల క్లస్టర్ అధికారి ఎన్. సురేష్, మునుగోడు అధికారి ముత్యాలు, చిట్యాల విస్తరణాధికారి గోరఖ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.