నల్గొండ

డిగ్రీ విద్య నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, మార్చి 25: డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని మహాత్మగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్త్ఫా హుస్సేన్ సూచించారు. శనివారం యూనివర్సిటీలో జరిగిన ప్రిన్సిపాల్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్నల్ పరీక్షలు రాసిన విద్యార్థులనే సెమిస్టర్‌కు అనుమతించాలన్నారు. ఇంటర్నల్, సెమిస్టర్‌లలో సగటున 40 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణత పొందినట్లుగా గుర్తించాలన్నారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వాహణపై అవగాహన కల్పించుకోవాలన్నారు. 25 డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్స్ లేరని వెంటనే నియమించుకోవాలన్నారు. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయ్యర్ ఎడ్యూకేషన్ డేటాను ప్రతి కళాశాల ఏప్రిల్ 1వ తేదిలోగా యూనివర్సిటీకి అందించాలన్నారు. అదనపు పేపర్ల నిర్వాహణతో విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రర్ ఉమేష్‌కుమార్, డైరక్టర్ అల్వాల్వ్రి, రాంచందర్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.