నల్గొండ

ఎండుతున్న వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, మార్చి 26: ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో ఈ రబీ (యాసంగి)లో రైతులు సాగుచేసిన పంటలు నీరు అందక ఎండిపోతున్నాయి. మండలంలోని ఏఎమ్మార్పీ డిస్ట్రిబూటర్ కాలువ ద్వారా సాగునీటిని చెరువులకు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది. సమయానికి సాగునీటి సరఫరా అందకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గడ్డికొండారు, జంగారెడ్డిగూడం, పజ్జూరు, సూరారం, గోదవారిగూడెం, తిప్పర్తి, సర్వారం తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మండలంలో ఎక్కువ శాతం బోరుబావులపై ఆధారపడి వరి, ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారు. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వ నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
ఇక అన్ని పార్టీలు ఖాళీ..

* ఎమ్మెల్యే కూసుకుంట్ల
చౌటుప్పల్, మార్చి 26: టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుతో గ్రామాలలో అన్ని రాజకీయ పార్టీలు ఖాళీ అవుతున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు గుండు శ్రీరాములు, గర్ధాసు సుదర్శనంల సారథ్యంలో పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి గులాబీ కుండవాలు కప్పి, సభ్యత్వాలు అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్‌లోకి వరదల వస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసిఆర్ ఆహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అందులో భాగంగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, వ్యవసాయరంగం, కులవృత్తులు, పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారన్నారు. గొల్ల, కుర్మలకు గొర్రెల పెంపకం కోసం 4 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. చేనేతకు 1200, ఇబిసిలకు 1000 కోట్లు కేటాయించారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రూ.75వేలకు పెంచడం జరిగిందన్నారు. దళితులకు త్వరలో మూడెకరాల సాగు భూమి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం అభివృద్ధి వైపుకు దూసుకువెళ్తుందన్నారు. వారం రోజుల్లో పిలాయిపల్లి కాలువ పనులను ప్రారంభిస్తామన్నారు. యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి యేడాది లోపే సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అంతకు ముందు గ్రామ కూడలి ప్రాంతంలో టిఆర్‌ఎస్ జెండాను ఎమ్మెల్యే ఎగరవేశారు. మహాత్మాగాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటిసి సభ్యుడు బుచ్చిరెడ్డి, నాయకులు భూపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, మిర్యాల గోపాల్, గోవర్ధన్, గంగదేవి చొక్కయ్య, మహేష్, జగన్, ఊడుగు మల్లేశం, ఊడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.