నల్గొండ

ధర్మభిక్షం సేవలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మార్చి 26: తెలంగాణ సాయుధ పోరాటుయోధుడు, మాజీ ఎంపి దివంగత బొమ్మగాని ధర్మభిక్షం సేవలు మరువలేనివని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ధర్మభిక్షం 6వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎస్వి కళాశాల వద్ద గల ధర్మభిక్షం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధపోరాటంలో కీలక భూమిక వహించారని కొనియాడారు. సాయుధ పోరాటంతో పాటు గీతా వృత్తిదారుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన మహానీయుడన్నారు. శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా పలు పర్యాయాల ఎన్నికై నిస్వార్ధంగా పనిచేసిన మహానీయుడన్నారు. ధర్మభిక్షం లాంటి గొప్ప వ్యక్తి సూర్యాపేట ప్రాంతానికి చెందిన వ్యక్తికావడం గర్వకారణమన్నారు. నేటి తరం ధర్మభిక్షం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు డాక్టర్ పిండిగ వనజా, తండు శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ సల్మా, రాజారాం తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు నిర్వహించిన వర్దంతి కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు పటేల్ రమేష్‌రెడ్డితో పాటు పలు పార్టీల నాయకులు ధర్మభిక్షం విగ్రహానికి నివాళ్లర్పించారు.
గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో...
గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో మాజీ ఎంపి ధర్మభిక్షం వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం చిత్రపటానికి గౌడ సంఘం అధ్యక్షుడు బైరు దుర్గయ్యగౌడ్, సంఘం నాయకులు శెనగాని రాంబాబు, బైరు వెంకన్న తదితరులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో పల్స వెంకన్న, బైరు శేలేందర్ తదితరులు పాల్గొన్నారు.