నల్గొండ

జవాబుదారి లేని డిసిసిబి పాలకవర్గం సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 30: రైతులు, ప్రజల భాగస్వామ్యంతో చట్టబద్ధ సంస్థగా కొనసాగుతున్న నల్లగొండ డిసిసిబి బ్యాంకు పాలకవర్గం సమావేశాల వ్యవహారం జవాబుదారి రహితంగా రహస్యంగా సాగుతున్న తీరు ప్రశ్నార్ధకంగా మారింది. చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశం నిర్వాహణ వివరాలు బయటకు పొక్కకుండా నాలుగుగోడల మధ్యనే నిర్వహించుకుని సమావేశం అయ్యిందనిపించారు. డిసిసిబి సమావేశాలు ఎప్పుడు ఖారారు చేస్తున్నారో అసలు సమావేశాల నిర్వాహణ జరుగుతుందో లేదో కోరం మేరకు సభ్యులు హాజరయ్యారా లేదా కూడా ఎవరికి తెలియకుండా సమావేశాలు సాగిస్తున్న తీరు చైర్మన్ ముత్తవరపు పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆయన చైర్మన్‌గా ఉన్న కాపుగల్లు సొసైటీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సస్పెండ్‌కు గురై డిసిసిబి చైర్మన్ పదవి సైతం కోల్పోయే పరిస్థితిలో పడ్డారు. కోర్టును, సహకార ట్రిబ్యూనల్‌లను ఆశ్రయించి కాపుగల్లు సొసైటీ చైర్మన్‌గా కొనసాగుతు డిసిసిబి చైర్మన్ పదవిని తాత్కాలికంగా నిలుపుకున్నారు. అయితే దీనిపై కోర్టులో వివాదం కొనసాగుతుంది. సహకార చట్టం మేరకు పాలకవర్గ సమావేశాల నిర్వాహణ నిబంధనలు సైతం ఈ వివాదంలో గాలిలో కలిసిపోయి నిబంధనలకు విలువ లేకుండాపోయింది. ఈ నేపధ్యంలో డిసిసిబి చైర్మన్ పాండురంగారావు పెడుతున్న సమావేశాలకు మెజార్టీ డైరక్టర్లు డుమ్మా కొడుతుండగా కోరం లేక పదేపదే సమావేశాలు వాయిదా పడుతున్నాయి. గురువారం నిర్వహించిన పాలకవర్గం సమావేశంలో మధ్యాహ్నం వరకు కోరం లేదు. అయితే నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం పిదప 11మంది డైరక్టర్ల కోరం పూర్తయ్యిందంటు సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పాండురంగారావు డిసిసిబి పాలకవర్గం సమావేశాలను ఇష్టరాజ్యంగా సాగిస్తున్న తీరుపై సహకార సంఘాల సభ్యుల్లో తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు డిసిసిబి చైర్మన్ పదవిపై హైకోర్టుల్లో సాగుతున్న కేసులు ఎంతవరకు వచ్చాయన్నదానిపై అధికారుల్లో, పాలకవర్గంలో ఎవరికి స్పష్టత లేకుండా పోయింది. ఈ వివాదంపై అటు చైర్మన్, ఇటు బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు ధాటవేత వైఖరి పాటిస్తుండటం విమర్శలకు తావిస్తుంది. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న డిసిసిబి పాలకవర్గం పనితీరు బ్యాంకు లావాదేవిల నిర్వాహణకు ఇబ్బందికరంగా తయారైంది. డిసిసిబి చైర్మన్ పదవికై టిఆర్‌ఎస్‌లోని రెండు వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు డిసిసిబి మనుగడను దెబ్బతీస్తున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం కూడా విమర్శల పాలవుతుంది.
కాగా గురువారం జరిగిన డిసిసిబి సమావేశం వివరాలపై చైర్మన్ ముత్తవరపు పాండురంగారావును వివరణ కోరగా నాటకీయ పరిణామాల మధ్య కోరంకు కావాల్సిన డైరక్టర్లు హాజరవ్వడంతో సమావేశం నిర్వహించామన్నారు. సమావేశాలకు మీడియాకు అనుమతి లేదన్నారు. చైర్మన్ పదవిపై నెలకొన్న వివాదంతో సమావేశాల నిర్వాహణ ఇటీవల గందరగోళమైందని చివరకు సమస్య సద్ధుమణిగినట్లుగా భావిస్తున్నామన్నారు. అయితే పాండురంగారావు ప్రత్యర్ధివర్గానికి నేతృత్వం వహిస్తున్న డైరక్టర్ పిల్లల మర్రి శ్రీనివాస్ మాట్లాడుతు గురువారం డిసిసిబి పాలకవర్గం సమావేశం జరుగకున్నా జరిగినట్లుగా చైర్మన్ ప్రకటించడంపై తాము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామన్నారు.