నల్గొండ

ప్రజాసేవకు సివిల్ సర్వీస్ ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 21: ప్రజలకు సేవ చేసేందుకు, సామాజిక ప్రగతికి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఉత్తమ మార్గాలను జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సివిల్ సర్వీసెస్ డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమ సేవలందించిన వారికి ప్రధాని చేతుల మీదుగా అవార్డులు అందిస్తారన్నారు. సివిల్ సర్వీసెస్‌లో ఉన్నవారు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలకు తమ సేవలందించాలన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి వారి ఉపాధి నైపుణ్యాల మెరుగుపరిచి ఉద్యోగ సాధనలో విజయవంతమయ్యేలా చేయాలన్నారు. సృజనాత్మకతతో సేవలందించాలన్నారు. ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు సర్వీస్‌డేను పురస్కర్కించుని ఉత్తమ సేవల దిశగా కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారికి గ్రూప్ 1, 2 పోస్టులకు ఎంపిక కారన్న అపోహ ఉండేదని కాని ఇప్పుడు 40నుండి 50శాతం వారే ఎంపికవుతున్నారన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు గ్రూప్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించే దిశగా తమ శాఖ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, ఎన్‌ఐసి డిఈవో గణపతిరావు, ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మార్కెట్‌లో
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
తిప్పర్తి, ఏప్రిల్ 21: తిప్పరి మార్కెట్ యార్డు, జంగారెడ్డిగూడెం ఐకెపి కేంద్రాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. పదిహేను రోజులవుతున్న ధాన్యం డబ్బులు తమ ఖాతాల్లో పడటం లేదని రైతులు ఫిర్యాదు చేయగా వారం రోజుల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించి డబ్బులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో డిఎం రాజేందర్, తహశీల్దార్ పందిరి వెంకటేశ్వర్‌మూర్తి, ఎంపిడివో మహేందర్‌రెడ్డి, ఏపిఎం శ్రీదేవిలు ఉన్నారు.

రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
* బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
మునుగోడు, ఏప్రిల్ 21: జనాభాలో అధిక శాతం ఉన్న బిసిలంతా ఐక్యంగా రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఓ వివాహానికి హాజరైన ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. చట్ట సభలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ల పెంచాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. జనాభా అధిక శాతం ఉన్న బిసిలకు 25 శాతం కల్పించడం ఎంతవరకు సబబని ఆయన సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో అందరికి రిజర్వేషన్లు కల్పిస్తామన్న కెసిఆర్ కేవలం మైనార్టీలకే కల్పించడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ శాస్ర్తీయ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లేనిపక్షంలో రాజ్యాంగ బద్ధమైన హక్కులకై ఉద్యమాలు తప్పవన్నారు. త్వరలో హైదరాబాద్‌లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో 50 శాతం రిజర్వేషన్ల సాధించుకోవడం కోసం బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్యయాదవ్, జెఎసి జిల్లా అధికార ప్రతినిధి తోట నరసింహచారి, బిసి నాయకులు జాల వెంకన్నయాదవ్, మాల్గ యాదయ్య, బూడిద మల్లిఖార్జున్, గుంటోజు వెంకటాచారి, భాస్కర్, పోలగోని బాస్కర్, బొల్లం వెంకన్నయాదవ్, ఆనగంటి కృష్ణ, జీడిమెట్ల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

దేశ ప్రజానికం చూపు.. బిజెపి వైపు..
2019లో రాష్ట్రంలో బిజెపిదే అధికారం
పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహరెడ్డి
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 21: రానున్న 2019 ఎన్నికలలో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రావడం తధ్యమని, యావత్ భారత ప్రజానికం బిజెపి వైపు చూస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 23న నల్లగొండలో పార్లమెంట్ స్థాయి బూత్ కార్యకర్తల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 7 అసెంబ్లీ నియోజక వర్గాల నుండి ప్రతి బూత్‌కి 10మంది చొప్పున కార్యకర్తలు హాజరవుతారని, ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా కేరళ ఎంపి సురేష్ అంగాడీ, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొంటారన్నారు. సమావేశంలో పోతెపాక సాంబయ్య, ఓరుగంటి రాములు, అనిల్ కుమార్, పల్లె ప్రకాష్ ఉన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిపించాలి
* కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ, ఏప్రిల్ 21: ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగంగా నిర్వహించడం ద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో పౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో రబీ ధాన్యం కొనుగోలు తీరుతెన్నులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు రైతులు మార్కెట్ యార్డులు, ఐకేపి కేంద్రాలకు ధాన్యం భారీగా తరలిస్తున్నందునా టొకెన్ల పద్ధతి మేరకు కొనుగోలు వేగంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. గన్నీ బ్యాగ్‌లు, కాంటాలు, తేమ యంత్రాలు సరిపడ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, మిల్లర్లు అన్‌లోడింగ్‌లో జాప్యం చేస్తే అందుకు వారే బాధ్యత వహించాలన్నారు. లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ధాన్యం ఎగుమతిలో మరింత సమర్ధవంతంగా పనిజరిగేలా చూడాలన్నారు. రైతుల ధాన్యం డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని సకాలంలో వారి డబ్బుల చెల్లింపు ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు తగినన్ని రైతులకు అందుబాటులో ఉంచాలని, ధాన్యం తడిసిపోయే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు వేగంగా జరిపించాల్సివుందన్నారు. ఈ సమావేశంలో జెసి సి.నారాయణరెడ్డి, డిఆర్‌వో ఖిమ్యానాయక్, డిఎస్‌వో ఉదయ్‌కుమార్, డిఎం రాజేందర్, ఏడి అలిముద్ధిన్‌లు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు వాగులో పడి బాలుడి మృతి
పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 21: మండలంలోని పోల్కంపల్లి గ్రామ సమీపంలోని వాగులో పడి తేరా దిలీప్‌రెడ్డి (14) దుర్మరణం చెందాడు. గుడిపల్లి పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన తేరా మట్టారెడ్డి-విజయలక్ష్మిల కుమారుడైన దిలీప్‌రెడ్డి మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన తన మామ గున్‌రెడ్డి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి వేసవి సెలవుల నిమిత్తం బుధవారం వచ్చాడు. అదేరోజు సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన దిలీప్ కనిపించకుండా పోయాడు. దీంతో బంధువులంతా అతడి గూర్చి ఎంత వెతికినా దొరక్కపోవడంతో గుడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం గ్రామ సమీపంలోని వాగులో దిలీప్‌రెడ్డి మృతదేహం తెలియడుతూ కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.
నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉమామహేశ్వర్
నల్లగొండ లీగల్, ఏప్రిల్ 21: నల్లగొండ బార్ అసొసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం పోటాపోటీగా సాగాయి. ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా కె.ఉమామహేశ్వర్, ఉపాధ్యక్షులుగా ఎం.లెనిన్‌బాబు, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీనివాసచక్రవర్తి, సహాయ కార్యదర్శిగా దాసరి యాదగిరి, కోశాధికారిగా నాంపల్లి నరసింహా, క్రీడల కార్యదర్శిగా గంజి వెంకటేశ్వర్లు, సాంస్కృతిక కార్యదర్విగా పి.ఏసురత్నం, మహిళా ప్రతినిధిగా దిల్‌నాజు, కార్యవర్గ సభ్యులుగా జనిగల రాములు, సయ్యద్ జమిల్, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, జి.కిషోర్‌కుమార్, ఎన్. ప్రసన్నకుమార్, సిహెచ్.గోపాల్, మంద నగేష్, పి.శ్యాంప్రసాద్‌లు ఎన్నికయ్యారు.

యాదాద్రిలో రాజగోపుర శిలద్వార ప్రతిష్ఠ
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 21: యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహస్వామి దేవస్ధానం కొండపైన ఆచార్యులు శుక్రవారం శాస్త్రోక్తంగా తూర్పు, ఉత్తర, రాజగోపుర శిల ద్వార ప్రతిష్ఠాపన చేశారు. ముందుగా కృష్ణశిలలకు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నర్సింహ్మాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చక బృందం నిర్వహంచగా కార్యక్రమంలో వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, దేవస్థానం కార్యనిర్వహనాధికారి గీత, చైర్మన్ నర్సింహమూర్తి, స్థపతి సుందరరాజన్, వేలు, పిఏలు ఆకునూరి చంద్రశేఖర్, ఈఈ దయాకర్‌రెడ్డి, డిఈ మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తేవాలి
జడ్పీ సిఈవో హనుమానాయక్
గుర్రంపోడు, ఏప్రిల్ 21: మండల ప్రజలు తమ గ్రామాల్లోని తాగునీటి సమస్యలను స్థానిక ఎంపిడివో కార్యాలయంలో తెలపాలని జడ్పీ సిఈవో హనుమానాయక్ తెలిపారు. శుక్రవారం ఎంపిడివో కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ గ్రామాల్లోని రైతుల బోర్లను అద్దెకు తీసుకుని, ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీటి సరఫరాకు చర్యలు చేపడుతామన్నారు. గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు పెంచుతామని ఎండకాలంలో కారణంగా ఉదయం 8 గంటల నుండి 10, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరు నీటి పరిరక్షణకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలన్నారు. గ్రీన్‌డే సందర్భంగా ఎంపిడివో కార్యాలయంలో మొక్కలకు ఆయన నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎంపిడివో పూలమ్మ, సిబ్బంది నాగయ్య, అండాలు, సునీత పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగిరం
* సమీక్షా సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశం

నల్లగొండ, ఏప్రిల్ 21: ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగంగా నిర్వహించడం ద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో పౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో రబీ ధాన్యం కొనుగోలు తీరుతెన్నులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు రైతులు మార్కెట్ యార్డులు, ఐకేపి కేంద్రాలకు ధాన్యం భారీగా తరలిస్తున్నందునా టొకెన్ల పద్ధతి మేరకు కొనుగోలు వేగంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. గన్నీ బ్యాగ్‌లు, కాంటాలు, తేమ యంత్రాలు సరిపడ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, మిల్లర్లు అన్‌లోడింగ్‌లో జాప్యం చేస్తే అందుకు వారే బాధ్యత వహించాలన్నారు. లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ధాన్యం ఎగుమతిలో మరింత సమర్ధవంతంగా పనిజరిగేలా చూడాలన్నారు. రైతుల ధాన్యం డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని సకాలంలో వారి డబ్బుల చెల్లింపు ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు తగినన్ని రైతులకు అందుబాటులో ఉంచాలని, ధాన్యం తడిసిపోయే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు వేగంగా జరిపించాల్సివుందన్నారు. ఈ సమావేశంలో జెసి సి.నారాయణరెడ్డి, డిఆర్‌వో ఖిమ్యానాయక్, డిఎస్‌వో ఉదయ్‌కుమార్, డిఎం రాజేందర్, ఏడి అలిముద్ధిన్‌లు పాల్గొన్నారు.