నల్గొండ

కమ్ముకుంటున్న మబ్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఏప్రిల్ 28: అన్నదాతలను వ్యాపారులు ఒకపక్క దోచుకుంటుంటే మరోపక్క ప్రకృతి కూడా అన్నదాతలతో దోబూచులాడుతుంది. మధ్యాహ్నం వేళల్లో రాళ్లు పగిలే ఎండవేడిమి.. సాయంత్రం వేళ ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుండడంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకపక్క హమాలీల కొరత మరోపక్క ఎండలతో ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కాంటాలు మందకొడిగా సాగుతున్నాయి. ఎండలకు హమాలీలు కాంటాలు వేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎండలతోపాటు సాయంత్రం వేళల్లో మబ్బులు కమ్ముకోని గాలులు వీస్తుండడంతో ఎక్కడ అకాల వర్షం పడి ధాన్యం తడిసి నష్టపోతామోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈసంవత్సరం సాగర్, మూసి ఆయకట్టులతోపాటు బోరుబావుల కింద ఈ సంవత్సరం భారీగా వరిపంటలు సేద్యం చేశారు. అయితే అధికారుల అంచనాలకు మించి ఆశించిన దానికన్నా రబీలో వరిసాగు విస్తీర్ణం భారీగా చేశారు. గత మూడు సంవత్సరాలుగా కరవుతో అల్లాడిన అన్నదాతలకు ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు పంటలు పండుతాయని ఆశపడి వరిపంటను రబీలో సేద్యం చేశారు. కాని పంట చేతికొచ్చిన సమయంలో పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఐకెపి, సహకార సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాట్లు చేసినప్పటికి అందుకుతగ్గ విధంగా మిగిలిన ఏర్పాట్లను చేయలేకపోయింది. ఐకెపి, సహకార సంఘాల ద్వారా ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయలేకపోయింది. దాంతో రైతులు నూర్పిడిచేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన నిరీక్షించారు. మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి, దామరచర్ల, త్రిపురారం, నిడమనూరు, హాలియా తదితర మండలాల్లోని గ్రామాల్లో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అయితే ఒక్కసారిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడంతో కాంటాలు సక్రమంగా కాక ఐకెపి కేంద్రాల్లో ధాన్యం భారీగా పేరుకపోయింది. అయితే గత నాలుగు రోజులుగా సాయంత్రం వేళల్లో ఆకాశంలో మబ్బులు కమ్ముకోని వాతావరణం చల్లబడుతుండడంతో రైతుల గుండెలో గుబులు పుడుతోంది. అయితే ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడపడితే అక్కడ ఏర్పాటుచేయడంతో వర్షం వస్తే ధాన్యం తడిసే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కాంటాలు వేసి తరలించేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు పేర్కొంటున్నారు.

పండ్ల రైతులకు పరిహారం అందించాలి
* జూలకంటి

నల్లగొండ, ఏప్రిల్ 28: అకాల వర్షాలతో నష్టపోయిన నిమ్మ, బత్తాయి, మామిడి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్టక్రార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుత ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం కోరుతుందన్నారు. రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగ్‌లు, టార్ఫాలిన్లు, ఇతర వసతులు కల్పించాలన్నారు. నిన్న కంది, నేడు మిర్చి, ధాన్యం కొనుగోలులు ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సీఎం కెసిఆర్ రైతు పక్షపాతిగా మాయమాటలు చెతుతు మరోసారి వరంగల్ సభ ద్వారా మాటల మోసానికి దిగారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం పూర్తిగా అమలు చేయకపోగా కొత్తగా ఎకరాలకు ఎరువుల కోసం ఏటా ఎనిమిది వేలు ఇస్తామంటు మభ్యపెడుతున్నారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతు పార్టీ రాబోయే కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. గ్రామాల్లో ఉపాధి కూలీలు, రైతుల సమస్యలపై ఉద్యమించాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు ఉద్యమించాలన్నారు. మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. పార్టీ సీనియర్ నేత పి.అనంతరామశర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, బండ శ్రీశైలం, డి.మల్లేశం, పాలడుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.