నల్గొండ

మిషన్ కాకతీయతో సాగునీటికి కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, మే 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల ద్వారా చెరువుల పూడిక తీసి సాగునీటికి కొరత లేకుండా తీర్చిదిద్దుతున్నామని భువనగిరి ఎంపి బూరనర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం మిషన్ కాకతీయ మూడో విడతలో భాగంగా బీబీనగర్ మండలంలోని జియాపల్లి ఊరచెరువు, మహాదేవపూర్‌లోని ఎల్లమ్మకడి, కొండమడుగులోని సోలాని కాలువ, జైనపల్లిలో నల్లకుంట, గూడురులోని ఫీడర్ చానల్ కాలువ, బీబీనగర్‌లోని ఇస్రాయిపల్లి కుంట, పడమటి సోమారంలోని యాసాలకుంట, రుద్రవెల్లి కాలువ పనులు, లక్ష్మీదేవిగూడెంలోని పిల్లోని కుంట, బ్రాహ్మణపల్లిలోని ఊరచెరువు, మాదారంలోని శ్రీరాం సాగర్ చెరువుల కింద మంజూరైన సుమారు 4కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులను ఎంపి బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిలు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పనులను కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలంలో చెరువులు, కుంటలు నింపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గోళి ప్రణితా రెడ్డి, వైస్ ఎంపిపి కొంతం లింగయ్యగౌడ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎరుకల సుధాకర్‌గౌడ్, బొక్క జైపాల్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ డిఈ రవీందర్, ఏఈ పరమేష్, మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల అశోక్, సర్పంచ్‌లు తంతరపల్లి అంజయ్యగౌడ్, ఎరుకలి అనసూయ, సంకూరి మీరాబాయినాగరాజు, పలుసం కవిత, తలబోయిన జంగయ్యయాదవ్, పల్లెయాదిరెడ్డి, గాదె కవిత, పెరమాండ్ల చంద్రకళ అమరేందర్, శ్రీరాం పద్మ, ఎంపిటిసిలు మనె్న బాల్‌రాజు, కడెం శేఖర్, బింగి మంగమ్మ శ్రీనివాస్, బొమ్మగాని ప్రతిభ, గడ్డం కవిత, పంజాల సతీష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

వైద్యశాలలను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తాం
*హుజూర్‌నగర్‌లో పిల్లల వార్డు ఏర్పాటు చేస్తాం
*కలెక్టర్ సురేంద్రమోహన్

హుజూర్‌నగర్, మే 9: జిల్లాలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెనపహాడ్ పిహెచ్‌సిని మోడల్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన సేవలు అందించనున్నామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ సరేంద్రమోహన్ అన్నారు. మంగళవారం ఆయన హుజూర్‌నగర్‌లోని 100 పడకల ప్రభుత్వ ఏరియా వైద్యశాలను 2 గంటల పాటు పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ పెనపహాడ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన అభివృద్ధిని చూసి చాలా ప్రశంసించారన్నారు. అదే స్థాయిలో అన్ని ప్రభుత్వ వైద్యశాలలను, పిహెచ్‌సిలను అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుండి వైద్య పరికరాలు, వైద్యులు, అంబులెన్స్‌లు, ఇంకా ఇతర వౌలిక అవసరాల కొరకు గతంతలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వాటికి నిధులు కూడా మంజూరై దశల వారీగా వస్తున్నాయని అన్నారు. వైద్యశాలలో పిల్లల వార్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే మంచినీటి ప్లాంటు పూర్తి అయినదన్నారు. గైనకాలజిస్టు కొరకు నోటిఫై చేసి నెలకు లక్ష రూపాయల జీతం ఇస్తామన్నా ఎవ్వరూ రాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న గైనకాలజిస్టుకు తోడుగా మరో ఇద్దరు మహిళా డాక్టర్లను నియమిస్తామని కలెక్టరు ప్రకటించారు. గరిడేపల్లికి చెందిన ఒక మహిళా రోగితో మాట్లాడి అంత దూరం నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారని, అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే ఇక్కడకు రావచ్చని, గరిడేపల్లిలో, కల్మలచెర్వులో పిహెచ్‌సిలు ఉన్నాయని అన్నారు. అంతా ఒక్కచోటకే వస్తే రోగులకే సమస్యలు వస్తాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేసి ఎక్కడి కక్కడే వైద్యం చేయించాలని సూచించారు. పిహెచ్‌సిలలో వైద్యుల కొరత నివారించటానికి ఐఎంఏతో కూడా మాట్లాడామన్నారు. అవసరమైన చోటుకు వారు డాక్టర్‌ను పంపుతారని, సూర్యాపేట నుండి గరిడేపల్లికి ప్రభుత్వ వాహనంలోనే చేర్చుతారని అనంతరం వైద్య ఖర్చులు కూడా చెల్లిస్తామన్నారు. అమ్మఒడి కార్యక్రమం సిద్ధమైనదని త్వరలో ప్రారంభిస్తారని అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది చక్కగా పనిచేస్తున్నారని ఇంకా ఏమి సదుపాయాలు కావాలో కోరామని కలెక్టర్ అన్నారు.
నూతన తహశీల్ భవనాల పరిశీలన
ప్రభుత్వ ఏరియా వైద్యశాల, నగర పంచాయతీ దుకాణాల సముదాయం కలెక్టర్ సురేంద్రమోహన్ పరిశీలించారు. అనంతరం పట్టణంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన తహశీల్దార్ కార్యాలయ భవనాలను పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని లింగగిరి రహదారిలో ఉన్న నగర పంచాయతీ దుకాణాల సముదాయంపై ఫిర్యాదులు రావటంతో కలెక్టర్ వాటిని కూడా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమిషనరేటుకు నివేదిక పంపిస్తామన్నారు. దుకాణాలు ఖాళీగా ఉంచకుండా చర్యలు తీసుకోవాలని హైద్రాబాద్‌లోని మున్సిపల్ కమిషనరేట్ అధికారులను కోరనున్నట్లు చెప్పారు.

సంక్షేమంలో ప్రభుత్వం విఫలం
* మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
ఆలేరు, మే 9: సంక్షేమ పథకాల అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం స్థానిక పాల శీతలీకరణ కేంద్ర ఆడిటోరియంలో పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు. రెండోసారి ఎన్నికల్లో లబ్ధికోసం ప్రజలను మభ్యపెట్టడానికి అనేక ఉచిత హామీలిచ్చి కుట్రలకు సిఎం కెసిఆర్ పాల్పడుతున్నారన్నారు. టిడిపి పార్టీకి గ్రామగ్రామాన పటిష్టమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరిస్తు 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అధికార పార్టీ వలసల వల్ల పార్టీకి నష్టం జరుగలేదని, నిజమైన పార్టీ కార్యకర్తలంతా పార్టీలోనే కొనసాగుతున్నారన్నారు. టిఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం ఓటమి తప్పదన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, మండల నాయకులు చామకుర అమరేందర్‌రెడ్డి, ఎండి.సలీమ్, పూర్ణచందర్‌రాజు, పి.హేమలత, రాంరెడ్డి, జానయ్య, మధుసూధన్‌రెడ్డి, బాలయ్య, అంజనేయులు, మల్లేశ్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నరుూం ముడుపుల లెక్కతేల్చాలి
* కేసును నీరుగార్చిన ప్రభుత్వం
* మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

అర్వపల్లి, మే 9: కోట్లాది రూపాయాలు సంపాదించి అధికార పార్టీ నాయకులు ముడుపులు చెల్లించిన నరుూం కథను అట్టకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు, మేథావులు పరిశీలిస్తున్నారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాగారం మండల పరిధిలోని పేరబోయినగూడెంలో బొడ్రాయి ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. దొంగనోట్ల వ్యవహరంతో ఎమ్మెల్యేకు సంబంధం ఉందని తేలినా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నరుూంతో అధికార పార్టీ నాయకులు పార్టీలు చేసుకొని కోట్ల రూపాయాలు తీసుకున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చిన పట్టించుకోకుండా కేసులు నీరుగార్చారన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు చెప్పుకుంటున్న ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర్‌రెడ్డి చొరవతో జరిగిందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం ఎడారిగా మారుతున్న శాస్తవ్రేత్తల సూచనలతో ఎమ్మెల్యేగా తాను ఎస్సారెస్పీ కాల్వ కోసం లక్షలాది మందితో రక్తతర్పన చేసినట్లు తెలిపారు. లక్షలాది మందితో ప్రజాప్రతిధ్వని సభ నిర్వహించి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తుంగతుర్తి నియోజకవర్గ కష్టాలను తెలియజేయడం వల్లనే ఈ కాల్వ నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పటికి పూర్తిస్థాయిలో నీరు విడుదల కావడం లేదని ఆరోపించారు. కమ్యూనిస్టుల ఆరాచకాలతో అట్టుడిగిపోయిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలు స్వేచ్ఛ గాలులు తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తుంగతుర్తి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెవిటి వెంకన్న, కొప్పుల వేణారెడ్డి, ఆకుల బుచ్చిబాబు, వెంకటేశ్వర్లు, బైరబోయిన మహారాజు, సైదులు, నరహరి పాల్గొన్నారు.

అభివృద్ధి పథకాల జోరు పెంచాలి
*మండల అభివృద్ధి అధికారులకు కలెక్టర్ ఉప్పల్ పిలుపు

నల్లగొండ, మే 9: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు లక్ష్యాల సాధనలో వేగం పెంచాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ లక్ష్యాల సాధనకు వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపింగ్ యార్డ్సు, ఇంకుడు గుంతలు, పారిశుద్ధ్య పరిరక్షణ చర్యలను పంచాయతీల్లో విస్తృతంగా చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ పథకం పనులను గడువులోగా పూర్తి చేసేలా గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణాల జోరు పెంచాలన్నారు. పనులకు ఏవైనా ఆటంకాలు ఎదురైతే తన దృష్టికి తీసుకరావాలన్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం మంజూరుకు సొసైటీల ఏర్పాట్లు, లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే గొర్రెలు ఉన్నవారికి కూడా గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. ఈఏడాది సగం మందికి, వచ్చే ఏడాది సగం మందికి గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మత్స్యకార్మిక సంఘాల అభివృద్ధికి కావాల్సిన సహకారం అందించాలన్నారు. పండ్లతోటల్లో గొర్రెల మందలను పెట్టించడం ద్వారా దిగుబడుల వృద్ధికి, గొర్రెల పెంపకందారులకు మేతను అందించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఒంటరి మహిళలకు నెలకు వేయి రూపాయల ఆర్థిక భృతి అందించే పథకాన్ని జూన్ 2 నుండి ప్రారంభిస్తున్నందునా 8 నుండి 13 వరకు దరఖాస్తులు స్వీకరించి 18 వరకు పరిశీలన, 19 నుండి 21 వరకు అభ్యంతరాల స్వీకరణ, 22న జాబితాల ప్రదర్శన, 23 నుండి 35 వరకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్, 27న మంజూరు ఉత్తర్వుల జారీ ప్రక్రియలు నిర్వహించాలన్నారు. సంక్షేమ పథకాల్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. సమావేశంలో జడ్పీ సిఈవో హనుమానాయక్, జెడిఏ నర్సింహులు, డిఆర్‌డివో అంజయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పాపారావు, స్వచ్ఛ్భారత్ కో-ఆర్డినేటర్ కరణ్‌చక్రవర్తి, యూనిసెఫ్ ప్రతినిధి శరత్, ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారి సుధాకర్, హనుమంతరావు పాల్గొన్నారు.

స్వచ్ఛంద సంస్థలు అనుమతులు పొందాలి
*స్ర్తి, శిశు సంక్షేమ శాఖ పిడి పుష్పలత

నల్లగొండ, మే 9: జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తమ సంస్థల నిర్వాహణకు ప్రభుత్వం నుండి తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్ర్తి, శిశు సంక్షేమ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ పిడి పుష్పలత సూచించారు. మంగళవారం స్వచ్చంద సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతు 0-18సంవత్సల బాలలకు ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు మే 31వ తేదిలోగా అనుమతులకు దరఖాస్తులు తీసుకోవాలన్నారు. లేనట్లయితే జూన్ 1న అనుమతులు లేని వాటిని మూసివేయించి అందులోని బాలలను ఇతర సంస్థల్లోకి తరలిస్తామన్నారు. ప్రతి నెలనెల ఆశ్రయం పొందుతున్న బాలబాలికల పూర్తి వివరాలు కార్యాలయానికి అందించాలన్నారు. చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్న ఎన్‌జీవో సంస్థల్లోని పిల్లలను బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశపెట్టి చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. అనాధ పిల్లల వివరాలు దాచితే బాలల హక్కుల చట్టం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. దేశ వ్యాప్తంగా 25వేల మంది తల్లిదండ్రులు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారని వీరందరికి పిల్లలకు దత్తత ఇవ్వాలంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉన్న అనాధ చిన్నారును సిఏఆర్‌ఏ దత్తత విభాగంలోకి తీసుకరావాలన్నారు. శిశు విక్రయాలు అరికట్టేందుకు మన ఇంటి లక్ష్మి అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా తండా స్థాయి నుండి ఆడపిల్లల సంరక్షణ, శిశువిక్రయాల నివారణపై ప్రచారం సాగిస్తున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణి వివరాలతో పాటు పిల్లల వివరాలను ఆన్‌లైన్ చేస్తున్నందునా పిల్లల తరలింపు, విక్రయాలు ఇకమీదట కుదరబోదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిశు, బాలిక, మహిళా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని బాలబాలికలను తల్లిదండ్రులు సంరక్షించుకోవాలన్నారు.

శాంతి భద్రతలపై నిరంతర దృష్టి
మొక్కలు నాటిన ఎస్పీ ప్రకాశ్ రెడ్డి
నార్కట్‌పల్లి, మే 9: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ సిబ్బంది నిరంతరం దృష్టి సారించాలని ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కట్‌పల్లి కామినేని వై జంక్షన్ వద్ద తరుచు జరుగుతున్న ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, వెంటనే ట్రాఫిక్ సిబ్బందిని అక్కడ నియమించాలన్నారు. మండల కేంద్రం మీదుగా విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారి వెళ్తుంన్నందునా అన్ని ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రైవేటు సంస్థలు, దుకాణాల్లో కూడా వాటి ఏర్పాటుకు ప్రొత్సహించాలన్నారు. చెర్వుగట్టు దేవస్థానం శాంతి భద్రతలపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు. క్రైమ్ రేటు తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ప్రజలతో మమేకం కావాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు ఆహ్లాదం పంచేలా పచ్చదనం అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సుధాకర్, సిఐ సుబ్బరాంరెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
గుర్రంపోడు, మే 9: పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విటినగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నేతళ్ల లక్ష్మయ్య (35) తనకున్న నాలుగు ఎకరాల భూమిలో రెండున్నర ఎకరాల దొండసాగు, రెండున్నర ఎకరాలు పత్తి సాగు చేశాడు. ఇందుకు సుమారు ఆరు లక్షల రూపాయలు అప్పు చేశాడు. దొండ గిట్టుబాటు ధర లేక, పత్తి ఆశించిన దిగుబడి రాక చేసిన అప్పులు పెరిగిపోవడంతో నిరాశతో పురుగుల మందు తాని వ్యవసాయ బావి వద్దనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జయమ్మ, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ లెంకల అశోక్‌రెడ్డి కోరారు. మృతుడి భార్య ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా ఎస్‌ఐ తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలో
డిఎం అండ్ హెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు
* అనుమతి లేని స్కానింగ్ మిషన్ల సీజ్.. కేసు నమోదు
నేరేడుచర్ల, మే 9: మండల కేంద్రమైన పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో మంగళవారం సూర్యాపేట జిల్లా వైద్యాధికారి టి.మురళీమోహన్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్థానిక హుజూర్‌నగర్ రోడ్డులో వెంకటేశ్వర నర్సింగ్‌హోంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్కానింగ్ మిషన్ సీజ్ చేసి డాక్టర్ భరద్వాజపై కేసు నమోదు చేశారు. వైద్యశాల రిజిస్ట్రేషన్ కాలపరిమితి దాటినప్పటికి రెన్యూవల్ చేయకపోవడంతో నోటీస్ జారీచేశారు. అనంతరం జాన్‌పహాడ్ రోడ్డులోని శ్రీనివాస నర్సింగ్ హోంలో తనిఖీలు నిర్వహించి అనుమతి పత్రాలు పరిశీలించి వైద్యసేవలకు సంబంధించిన ధరల పట్టిక ఏర్పాటుచేయాలని సూచించారు. వైద్యశాలలో ఉపయోగించిన వ్యర్ధాలను జనావాసాల నడుమ వదిలివేయకుండా చూడాలన్నారు. భవాని నర్సింగ్ హోంలో పరిశీలన చేసి ఆయుర్వేద పట్టాతో అల్లోపతి వైద్యం చేయకూడదని కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని వైద్యులు భవాని, శాంతిలకు సూచనలు చేశారు. నిబంధనలకు, విద్యార్హతలకు తగిన వైద్యసేవలు మాత్రమే చేయాలన్నారు.