నల్గొండ

చెక్‌బౌన్స్ కేసులో నార్కట్‌పల్లి జడ్పీటిసికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, జూన్ 5: చెక్‌బౌన్స్ కేసులో నార్కట్‌పల్లి జడ్పీటిసి దూదిమెట్ల సత్తయ్యకు జైలుశిక్ష విధిస్తూ నల్లగొండ మొబైల్ కోర్టు జడ్జి రోజారమణి సోమవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ పట్టణానికి చెందిన కౌడబోయిన సాయినాథ్ వద్ద 15 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని, చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్ బౌన్స్ కేసులో సత్తయ్యకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అదే విధంగా సాయినాథ్‌కు నష్టపరిహారంగా నెల రోజుల్లో 15 లక్షల రూపాయలు చెల్లించాలని సత్తయ్యను ఆదేశించారు.

శ్రీనివాస్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
భువనగిరి, జూన్ 5: నరేష్, స్వాతిల హత్యకేసులో నిందితులు తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి అతని సహోదరుడు సత్యనారాయణరెడ్డిల కస్టడీ ముగియడంతో రాచకొండ పోలీసులు నిందితులను భువనగిరి అదనపుప్రధమశ్రేణి న్యాయమూర్తి నాగరాణి ఎదుట హాజరుపర్చారు. సోమవారం నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డిలను న్యాయమూర్తి నాగరాణి ఆదేశాలమెరకు తిరిగి భువనగిరి సబ్‌జైల్‌కు తరలించారు.
వాటర్‌ట్యాంకులో పడి బాలుడు మృతి
అడవిదేవులపల్లి, జూన్ 5: మండలంలోని బాల్నెపల్లి గ్రామానికి చెందిన కుర్ర వంశీ (14) ఆదివారం గ్రామంలో ఉన్న వాటర్‌ట్యాంకులో ఈతకు వెళ్లి మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం గ్రామంలో నీళ్లు రాకపోవడంతో కొందరు గ్రామస్థులు ట్యాంక్ వద్దకు వెళ్లి చూడగా ట్యాంకులో నుండి నీరు బయటకు వస్తుండడాన్ని గమనించారు. ట్యాంక్‌పైకి వెళ్లి మూత తీసి చూడగా బాలుడు మృతిచెంది ఉన్నాడు. ఈవిషయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించగా ఎస్‌ఐ శివకుమార్ వచ్చి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.