నల్గొండ

సంక్షేమ లక్ష్య సాధనకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 5: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బిసి మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో అందించి పథకాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ సలహాదారు రామలక్ష్మణ్ అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి వివిధ సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల మూడెకరాల భూ పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూములను లబ్ధిదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసి పొజిషన్ ఇవ్వాలన్నారు. భూసేకరణకు భూముల కొనుగోలుకు చొరవ తీసుకోవాలన్నారు. ఇప్పటికే పంపిణీ చేసిన భూముల్లో పంటల సాగు, పోజిషన్‌లపై తనిఖీలు నిర్వహించాలన్నారు. లబ్ధిదారులకు పంటల సాగుకు ప్రభుత్వ శాఖల నుండి అవసరమైన సహకారం అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ విద్యార్థులకు నూతనంగా మంజూరు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని, స్థలాలు ఎంపిక పూర్తయిన చోట వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. కార్పొరేషన్‌ల ద్వారా అందించే సబ్సిడీ పథకాల గ్రౌండింగ్‌కు బ్యాంకర్లపై ఒత్తిడి తేవాలన్నారు. 2015-16లో మంజూరైన అన్ని పథకాల గ్రౌండింగ్‌కు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించే బ్యాంకర్లతో, ఎంపిడివోలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పథకాల లక్ష్యాలను పూర్తి చేయించాలన్నారు. ఈ సమావేశంలో జెసి సి.నారాయణరెడ్డి, డిఆర్‌డివో ఆర్. అంజయ్య, కార్పొరేషన్ల జిల్లా అధికారులు సర్వోత్తంరెడ్డి, లక్ష్మణాచారి, వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ పిడి పుష్పలత, బిసి రెసిడెన్షియల్ పాఠశాలల కన్వీనర్ శోభలు పాల్గొన్నారు.

ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
* ప్రేమేందర్‌రెడ్డి
బీబీనగర్, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లొ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల విశ్వాసం కోల్పోయిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలోని వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పోలింగ్ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని కార్యకర్తలను కోరారు. రాబోవు ఎన్నికల వరకు బిజెపి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషిచేయాలని తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీ ఆదరణచూసి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందని విమర్శించారు. ఈసమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి శ్యాంసుందర్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ధనుంజయ్య, నాయకులు బోయపల్లి గోపాల్‌రెడ్డి, వింజమూరి ప్రభాకర్, బొర్ర వెంకట్‌రెడ్డి, పొట్ట నవీన్, వెంపటి సుదర్శన్, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తొడేలులా దోచుకుంటున్న కెసిఆర్
* మాజీ మంత్రి రవీంద్రనాయక్

దేవరకొండ, జూన్ 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే దళితున్ని ముఖ్యమంత్రి చేసి కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన కెసిఆర్ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇచ్చిన మాటను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కి తొడేలులా రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని మాజీ మంత్రి రవీంద్రనాయక్ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని సీనియర్ న్యాయవాది నెమ్మికంటి సోమన్న నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ తన కుంటుంబాన్ని మాత్రం బంగారంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ల రీ డిజైన్‌ల పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్‌లకు వేల కోట్లను దోచి పెడుతున్నారని ఆయన కెసి ఆర్ పై నిప్పులు చెరిగారు. నమ్మిన వారిని నట్టేట ముంచడంలో కెసిఆర్ సిద్ధహస్తుడని ఆరోపించారు. వేయి కోట్లతో హరితహారం పథకంలో 49 కోట్ల మొక్కలను నాటినట్లు చెబుతున్న ప్రభుత్వం కనీసం వంద మొక్కలను కూడా బతికించలేక పోయిందన్నారు. పుష్కరాల పేరుతో కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్‌లు కల్పించినట్లు ప్రచారం చేసుకుంటున్నా ఈ రిజర్వేషన్‌లు అమలయ్యే అవకాశం లేదన్నారు. రిజర్వేషన్‌ల పేరుతో ఎస్టీలను కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళిత, బడుగు, బలహీనవర్గాల వ్యతిరేకి అయిన కెసిఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని రవీంద్రనాయక్ పిలుపునిచ్చారు. ఈ విలేఖరుల సమావేవంలో నెమ్మికంటి గౌరీశంకర్, నెమ్మికంటి రమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.