నల్గొండ

పేట కలెక్టర్‌కు రెడ్‌క్రాస్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 15: జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్‌కు రాష్టస్థ్రాయి రెడ్‌క్రాస్ అవార్డును అందుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమాలను ప్రోత్సహించిన వారికి అవార్డులను అందజేస్తున్నారు. జిల్లాలో విరివిరిగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయించి రక్తదాన కార్యక్రమాలను ప్రోత్సహించేలా కృషిచేసిన కలెక్టర్‌ను అవార్డుకు ఎంపికచేస్తున్నట్లు రాజ్‌భవన్ నుండి సమాచారం అందించారు. నూతన జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తాన్ని అందుబాటులో ఉంచేలా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.