నల్గొండ

అరాచకాలకు పాల్పడితే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన్‌కల్, సెప్టెంబర్ 19: అరాచకాలకు పాల్పడుతూ గ్రామాల్లో అలజడులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ తెలిపారు. మంగళవారం మండల పోలీస్‌ఠాణాను సందర్శించి విలేకరులతో మాట్లాడుతూ దసరా, బతుకమ్మ, దుర్గామాత ఉత్సవాలను కమిటీ నిర్వహకులు శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగేవిధంగా వ్యవహరించవద్దని సూచించారు. బెల్టు దుకాణాలకు అనుమతులు లేవని గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వారి వివరాలను పోలీసులకు అందజేయాలన్నారు. రాత్రివేళల్లో దుర్గామాత ఉత్సవాలను ప్రజలకు ఇబ్బందులు కల్గించే విధంగా వ్యవహరించవద్దని నిర్వహకులకు సూచించారు. దసరా సందర్భంగా గ్రామాల్లో ఏలాంటి అవాంచనీయ సంఘటలు జరకుండా పోలీస్ పహరా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కేసులకు సంబందించిన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సై లింగంయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.

చీరల పంపిణీ సక్రమంగా చేపట్టాలి
- చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 19: బతుకమ్మ చీరలను సక్రమంగా పంపిణీ చేయాలని, నాణ్యమైన చీరలనే అన్ని జిల్లాలకు అందించామని, డ్యామేజీ ఉన్న చీరలను తిప్పి పంపించాలని చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ అన్నారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ బతుకమ్మ చీరల నాణ్యతలో రాజీ పడలేదని, మంచి చీరలనే సరఫరా చేశామన్నారు. ఈ నెల 22 వరకు చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు. బతుకమ్మ చీరలు పొందేందుకు అర్హులై ఉండి ఆహార భద్రతా కార్డులో పేరు లేని వారి వివరాలు పంపించిన పక్షంలో వారికి చీరలు మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో 5,07,852 చీరలు అవసరం కాగా, ఇప్పటివరకు 3,94,622 చీరలు మాత్రమే వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 3,15,698 చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 78,924 చీరెలు పంపిణీ చేస్తామని, మొత్తం 730 కేంద్రాల్లో చీరల పంపిణీ జరుగుతుందన్నారు. కాన్ఫరెన్స్‌లో జౌళి శాఖ రాష్ట్ర ఏడి శ్రీనివాస్‌రెడ్డి, డిఆర్‌వో ఖీమ్యానాయక్, డిఆర్‌డివో అంజయ్య, జౌళి శాఖ జిల్లా ఏడి సంజీవరావు పాల్గొన్నారు.