నల్గొండ

రామన్నపేటకు చేరుకున్న ఆజాం మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, సెప్టెంబర్ 21: యాభైరోజుల క్రితం దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రామన్నపేట యువకుడు ఆజాం మృతదేహం గురువారం రామన్నపేటకు చేరుకుంది. జీవనోపాధి కోసం దుబాయి వెళ్లిన ఆజాం డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ ఆగస్టు 1న రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆజాం మృతదేహాన్ని ఇండియాకు తీసుకరావడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మృతుని తల్లిదండ్రులు షేక్‌వలీ, సుల్తానాతో పాటు బంధువులు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం ఆజాం మృతదేహం స్వగృహానికి చేరుకోవడం కొడుకు మృతదేహాన్ని చూసుకొని తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. ప్రత్యేక ప్రార్థనలు ముగించిన అనంతరం ఆజాం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం?
పెద్దవూర, సెప్టెంబర్ 21: మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేశారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. చిన్నారి స్థానిక స్వీట్ హౌస్‌లో స్వీట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సందర్భంలో దుకాణ యజమాని లైంగిక దాడికి యత్నించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పెద్దవూర పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక తల్లి ఫిర్యాదులో నిజానిజాలపై పోలీసులు స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
డిఈవో వెంకటనర్సమ్మ
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 21: రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని డిఈవో వెంకటనర్సమ్మ కోరారు. పట్టణంలోని డిఈవో కార్యాలయం ఎదుట గల అంబేద్కర్ విగ్రహానికి 161వ రోజు గురువారం ట్రస్మా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నుండి 365 రోజులు ట్రస్మా ఆధ్వర్యంలో నిత్యం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పిఆర్‌టీయూ అధ్యక్షుడు బిక్షంగౌడ్, కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు అజీజ్ షరీఫ్, కార్యదర్శి భాస్కర్, నర్సింహ, బిక్షమయ్య, సాయిరాం పాల్గొన్నారు.