నల్గొండ

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, సెప్టెంబర్ 22: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్సీ పూల రవీందర్ కోరారు. కోదాడ ఆర్‌యస్‌వి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం జరిగిన పిఆర్‌టియు జిల్లా కౌన్సిల్‌కు అసోసియేట్ అధ్యక్షుడు రామలింగారెడ్డి అద్యక్షత వహించగా ఎమ్మెల్సీ పూల రవీందర్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. పిఆర్‌టియు పోరాటాల ఫలితంగానే రాష్టప్రతి ఆమోదం పొందిన తెలంగాణ రాష్ట్ర సర్వీస్ రూల్స్‌ను విడుదల చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. గ్రాట్యుటీ పెంపుపై పిఆర్‌టియు కృషి ఫలించిందని ముఖ్యమంత్రి ఫైలుపై సంతకం పెట్టనున్నారని వెల్లడించారు. అప్రంటిస్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లను సాధించామని స్పెషల్ టీచర్లకు త్వరలో నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయిస్తామన్నారు. సిపియస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విదానాన్ని అమల్లోకి తెచ్చేంతవరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. సిపియస్ సమస్యను పిఆర్‌టియు భుజాన వేసుకొందని వెల్లడించారు. పండిట్‌లు, పిఇటిల అప్‌గ్రేడేషన్, ప్రమోషన్‌లు, బదిలీలను త్వరలో ప్రభుత్వంతో చర్చించి సాధిస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని, అక్షరాస్యతలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్ధానంలో వుంచాలని కోరారు. మహిళలు పదవీ విరమణ చేసేంతవరకు చైల్డ్ కేర్ లీవ్, మండలం నుండి రాష్ట్రం వరకు మహిళా విభాగం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కౌన్సిల్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు నివేదికను ప్రవేశపెట్టగా మాజీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బిక్షంగౌడ్, దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఓరుగంటి రవి, బొల్లికొండ కోటయ్య, ఖలీల్ అహ్మద్, భాస్కర్‌రెడ్డి, పిన్ని మధు, పప్పుల వీరబాబు, సాదె లక్ష్మినారాయణ, జితేందర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, కె.వి, నరేష్, అనిల్, మధుసూదన్‌రెడ్డి, పిడమర్తి వెంకటేశ్వర్లు, రిటైర్ట్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు కెసిఆర్ పెద్దపీట
* ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి
మోటకొండూరు, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడచులకు కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేస్తుందన్నారు. ప్రభుత్వం పండుగ సందర్భంగా అందజేసే చీరలను నచ్చని వారు పేద మహిళలకు ఇవ్వాలే తప్ప అనవసర రాద్దాంతం చేయడం తగదని సూచించారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సబ్ మార్కెట్ యార్డులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఎంపిపి గడ్డమీది స్వప్న, ఎంపిడివో సాంబశివరావు, తహశీల్దార్ రామకృష్ణ, ఎస్‌ఐ అశోక్‌కుమార్, సర్పంచ్ కొంతం లక్ష్మీ మోహన్‌రెడ్డి, ఎంపిటిసిలు బుగ్గ పర్వతాలు, ఎగ్గిడి బాలమ్మ, బొట్ల శంకర్, మోటె నర్సింహా, రఘునాథరాజు, రాందాస్‌గౌడ్, సిద్ధులు, మల్గ వెంకటేశ్, ఎల్లేష్, సిరబోయిన మల్కయ్య పాల్గొన్నారు.