నల్గొండ

కుల వృత్తులను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిండి, అక్టోబర్ 17: కుల వృత్తులను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి మంగళవారం ఆయన డిండి రిజర్వాయర్‌లో 9 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ చేపల వేటను వృత్తిగా చేసుకొని జీవించే ముదిరాజ్, బెస్త కులాలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం తోనే ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లు, చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వేయిస్తున్నారన్నారు. డిండి రిజర్వాయర్‌లో 14 లక్షల చేప పిల్లలను వేయాలని నిర్ణయించగా తొలి విడతగా 9 లక్షల చేపపిల్లలను వేసినట్లు చెప్పారు. మత్స్యకారులు చేపలను సంరక్షించుకొని ఆర్థికంగా బలపడాలని సూచించారు. కుల వృత్తులను కాపాడాలన్న లక్ష్యంతోనే మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా వేస్తున్నామని అదే విధంగా రజకులకు ఉచితంగా వాషింగ్‌మెషిన్‌లను పంపిణీ చేసే ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. నాయి బ్రాహ్మణులకు ఆధునాతన క్షౌరశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ డిండి రిజర్వాయర్‌లో 16 ఫీట్ల మేర నీరు ఉండడంతో చేపలు అనుకున్న సమయంలో పెరిగే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చేపలను సంరక్షించుకొని ఆర్ధికంగా బలపడి ప్రభుత్వ లక్ష్యాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి చరిత, ఎఫ్‌డివో అంజయ్య, ఎంపిపి వీరకారి నాగమ్మ, సర్పంచ్ మంజుల, ఎపీడివో వెంకటేశ్వర్లు, నాయకులు యాదగిరిరావు, తిరుపతయ్య, గుర్రం రాములు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.