నల్గొండ

శాంతి భద్రతలతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 21: ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని కొనసాగించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళ్లర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అమరులైన పోలీసుల త్యాగాన్ని, తెగువను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు నిరంతరం పనిచేసే పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కెసిఆర్ అధిక ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. గతంలో పోలీసులు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవని నేడు అందుకు భిన్నంగా ఇతర ప్రభుత్వ శాఖలతో పాటుగా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పోలీసులు సైతం భాగస్వామ్యులైతూ స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థను పాదుగొల్పుతున్నారన్నారు. సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. నూతనంగా ఆవిర్భావించిన సూర్యాపేట జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్దికి పోలీస్ యంత్రాంగం పాటుపడాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్, ఎస్పీ ప్రకాశ్ జాదవ్‌లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌శాఖకు అధిక ప్రాధాన్యతనిచ్చి శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి, మునుగోడు ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ యలగందుల వెంకటేశ్వర్లు, ఎఎస్పీ గంగారామ్, డిఎస్పీ నాగేశ్వర్‌రావు, ఎంపిపి వట్టె జానయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.