నల్గొండ

ఇవి మనుషులు తినే కూరలేనా?..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, అక్టోబర్ 22: మండలకేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు తినలేని విధంగా భోజనాలు ఉంటున్నాయని స్థానిక ఎంపిపి గుగులోతు స్వాతితేజనాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఆమె పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈసందర్భంగా భోజనాలు, తదితర వాటిని పరిశీలించారు. ఈసందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలలో పరిస్థితులు దారుణంగా మారాయని భోజనాల విషయంలో పిల్లలు నరకయాతన పడుతున్నారని పేర్కొన్నారు. మెనూ ప్రకారం పిల్లలకు కూరలు అందడం లేదన్నారు. ప్రతినెలలో ఆరు సార్లు మాంసాహరం పెట్టాల్సి ఉండగా కేవలం ఒక్కసారే పిల్లలకు పెడుతున్నారని వివరించారు. రోజు పెటాల్సిన గుడ్లు సక్రమంగా అందించడం లేదన్నారు. కుల్లిపోయిన, ఎండిపోయిన కూరగాయలతో కూరలు వండుతున్నారన్నారు. పాఠశాలలో 620 మంది పిల్లలు సక్రమంగా భోజనాలు అందక అల్లాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్ శ్యామలత విధులపట్ల నిర్లక్షం వహించడం వల్లే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

వృథాగా పోతున్న కృష్ణమ్మ

చౌటుప్పల్, అక్టోబర్ 22: ప్రజలకు తాగునీరు రక్షిత జలాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానీటి సరఫరా పైప్‌లైన్ పగిలిపోయి గత మూడు నెలలుగా కృష్ణమ్మ వృథాగా పోతున్న అధికారులు పట్టించుకోవడంలేదు. చౌ టుప్పల్ - వలిగొండ రోడ్డు వెంట ఏర్పాటు చేసిన పైప్‌లైన్ తాళ్లసింగారం రోడ్డు సమీపంలో కల్వర్టు వద్ద రెండు ప్రాంతాలలో పగిలిపోయి లక్షల లీటర్ల నీరు వృథాగా పో తున్నాయి. రోజు విడిచి రోజు ఈ పైప్‌లైన్ ద్వారా కృష్ణా నీరు సరఫరా అవుతుంది. పైప్‌లైన్‌కు నీరు వదిలిన వెంటనే కృష్ణమ్మ పైప్‌ల నుంచి ఉబికి బయటకు వస్తుంది. చుట్టుపక్కల ఉన్న గుంతలు నిండిపోతున్నాయి. పక్కనున్న వ్యవసాయ భూములు నిండిపోతున్నాయి. రైతులకు ఇబ్బందులు కల్గిస్తున్నాయి. రోడ్డు పక్కన రోజు వేల సంఖ్యలో ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతినిత్యం వెళ్తుంటారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు కన్పించడంలేదు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పగిలిపోయిన కృష్ణా నీటి సరఫరా పైప్‌లైన్‌ను మరమత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.