నల్గొండ

మేమెంతో మాకంత వాటా దక్కాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, అక్టోబర్ 23: రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు 2019 ఎన్నికల్లో బిసిల జనాభా ప్రకారం 50శాతం అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కేటాయించాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని మార్కెండేయ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బిసి సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50శాతం ఉన్న బిసిలకు నేటివరకు పార్లమెంట్‌లో సరైన ప్రాతినిధ్యం లభించడంలేదన్నారు. జనాభాలో మేమంత ఉన్నామో మాకంత వాటా దక్కాలని అన్నారు. అన్ని రాజకీయపార్టీలు బిసిలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారే తప్పా రాజ్యాధికారం కల్పించడంలేదన్నారు. పార్టీలకతీతంగా బిసిలంతా ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బిసిల అభివృద్ధి కోసం రూ.20వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రూపకల్పన చేసిన విధంగానే బిసిలకు కూడా సబ్‌ప్లాన్‌ను రూపొందించాలన్నారు. ఈనెల 28న అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి సబ్‌ప్లాన్‌పై స్పందించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో బిసిలు అత్యధికంగా పాల్గొన్నారని, రాష్ట్ర సాధనలో 1200మంది ఆత్మబలిదానం చేసుకోగా అందులో 1100మంది బిసిలే ఉన్నారన్నారు. రాజకీయపార్టీలు బిసిలు ఊడిగం చేసేవారు కారన్నారు. రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా బిసిలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బిసిలకు అవకాశం ఇవ్వని రాజకీయపార్టీలను సమాధి చేస్తామన్నారు. అన్ని రాజకీయపార్టీలు 2019లో బిసి పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్, నాయకులు పెద్ది శ్రీనివాస్‌గౌడ్, విక్రంగౌడ్, పందిర్ల పద్మావతి, బంటు వెంకటేశ్వర్లు, రమేశ్ ముదిరాజ్, దీపేందర్, రాపోలు పరమేశ్, సత్యనారాయణ, కాకునూరి రామకృష్ణ, దుర్గయ్య, జానకమ్మ, మారం శ్రీనివాస్, నాగభూషణం, రమేశ్, మహేశ్‌లు పాల్గొన్నారు.

సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్, అక్టోబర్ 23: నాగార్జునసాగర్ జలాశయానికి సోమవారం నాడు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. గత రెండురోజులుగా శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న నీరు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం నుండి సాగర్‌కు విడుదలవుతున్న నీటి పరిమాణాన్ని శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు చాలావరకు తగ్గించి వేశారు. ఆదివారం నాడు శ్రీశైలం నుండి సాగర్‌కు 14వేల క్యూసెక్కులు వచ్చి చేరగా సోమవారం సాయంత్రం శ్రీశైలం నుండి 68,770క్యూసెక్కులు నీరు వచ్చి చేరుకుంటుండగా ప్రస్తుతం సాగర్ జలాశయంలో 572.70 అడుగులకు పెరిగింది. ఇది 263.34టిఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి 24వేల క్యూసెక్కులు వస్తుండగా ప్రస్తుతం 884.20 అడుగుల నీటిమట్టం ఉంది. ఇది 210.20 టిఎంసిలకు సమానం.