నల్గొండ

నిజాం పాలననే మట్టికరిపించాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, అక్టోబర్ 23: నిజాం నిరంకుశపాలనను మట్టికరిపించిన చరిత్ర కమ్యూనిస్టులదని, నిజాం కన్నా ఎక్కువగా నిరంకుశ పాలనను సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మట్టికరిపించడం కమ్యునిస్టులకు పెద్ద పని కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ - సమగ్రాభివృద్ధికై సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట సోమవారం దేవరకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి స్థానిక జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో నిర్వహించిన బహిరంగసభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాధనలో తానే హీరోనన్న భ్రమలో కెసిఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమానికి సిపిఐతో పాటు పలు రాజకీయపార్టీలు రాష్ట్రంలో, కేంద్రంలో మద్దతు ఇవ్వడంతోనే తెలంగాణ సాధ్యమైందని కెసిఆర్ గుర్తిస్తే మంచిదన్నారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం దోచుకుతింటుందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు టిఆర్‌ఎస్ నాయకులకు ఫలహారంగా మారాయని ఆరోపించారు. ఈపథకాల్లో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్రం వస్తే ఎస్సెల్బీసి టనె్నల్ వద్ద కుర్చీ వేసుకు కూర్చొని పనులు చేయిస్తానని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రశ్నించారు.
జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని అయితే సిఎం కెసిఆర్ ప్రశ్నించే హక్కును ప్రజలనుండి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పొప్పులను ప్రశ్నించినప్పుడే ప్రభుత్వం పనితీరు సక్రమంగా ఉంటుందని అయితే కెసిఆర్ మాత్రం తన ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంపద అందరికీ పంచాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని కాని కెసిఆర్ ప్రభుత్వ సంపదను కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందిస్తూ మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకపక్ష మొండి విధానాలపై ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని కోదండరాం హెచ్చరించారు. సిపిఐ నిర్వహించిన పోరుబాటకు సిపిఎం రాష్టన్రాయకుడు చెరిపల్లి సీతారాం, టిడిపి జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ సంఘీభావం తెలిపి పోరుబాట సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పశ్య పద్మ, పల్లా దేవేందర్‌రెడ్డి, పారపల్లి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన
- ఏఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి
నాంపల్లి, అక్టోబర్ 23: రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్టవ్య్రాప్తంగా వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిని, రోగాలు వచ్చి నష్టం వాటిల్లినా రైతులను పరామర్శించే నేతలే కరువయ్యారన్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాకు 5 వేలు అందించి ఆదుకోవాలన్నారు. ప్రతీ మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్నారు. దెబ్బతిన్న పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపయోగంగా ఉన్న మార్కెట్ యార్డులను ప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా 9 రకాల నిత్యవసర వస్తువులు అందిస్తే.. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నింటినీ రద్దుచేసి బియ్యం మాత్రమే అందిస్తుందని, ప్రస్తుతం రేషన్ దుకాణాలను కూడా ఎత్తివేసి పేద ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో టీఆర్‌యస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ శైలజ, సర్పంచులు మల్లేపల్లి వెంకట్‌రెడ్డి, నర్సమ్మ లింగయ్య, వెంకటయ్య, మాజీ ఎంపిపి పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ నక్క చంద్రశేఖర్, ఎదుళ్ల రాములు, బిక్షం, వెంకటయ్య, కొండల్, యాదగిరి, సుదర్శనాచారి, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.