నల్గొండ

రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం.. ప్రభుత్వ నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, ఏప్రిల్ 21 : తెలంగాణా రాష్ట్రంలోని 438 మండలాలు, 8826 గ్రామ పంచాయితీలు, 21567 ఆవాసాలలో తీవ్ర కరువు, దుర్బిక్ష పరిస్థితులు ఉన్నా టిఆర్‌యస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని స్థానిక ఎంయల్‌ఏ, టిపిసిసి చీప్ యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
గురువారం సాయంత్రం హుజూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో పత్రికల వారితో మాట్లాడుతూ యుపిఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల క్రితం తెచ్చిన జాతీయ ఉపాధి హమీ చట్టాన్ని కూడా అమలు చేయకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నదని అన్నారు. గతంలో ఉపాధి హమీ పనులు చేసిన కూలీలకు 15 రోజులలో చెల్లించవలసిన వేతనాలు 2నెలలు దాటుతున్నా చెల్లించకుండా కేంద్రం విడుదల చేసిన నిధులను కాంట్రాక్టులకు, టెండర్లకు మళ్లిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో 12లక్షల మంది ఉపాధి హమీ కూలీలకు 310 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉన్నదని బడ్జెట్‌లో మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం లండన్, డల్లాస్ చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న నాయకులకు కూలీలు గుర్తుకు రావడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కూలీలు వలసలు పోతున్నారని చట్టపరంగా రావలసిన బకాయిలు 310 కోట్లు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హమీ పనికి రోజుకు 194 రూపాయలుగా కేంద్రం నిర్ణయించినా కూలీలకు 100 రూపాయలు కూడా గిట్టడం లేదని పనులు జరిగే వద్ద చేయవలసిన సౌకర్యాలు, మంచినీరు, టెంట్లు, కిట్‌లు, వైద్య సహాయం కల్పించటం లేదని అన్నారు. కరువు, వ్యవసాయ సంక్షోభం, దుర్బిక్షం, ఉపాధి పనులు తదితర అంశాలపై ఈనెల చివరి నుండి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతుతుందని పిసిసి చీప్ ప్రకటించారు. రాష్ట్రంలో 56లక్షల మందికి ఉపాధి హమీ జాబ్ కార్డులు ఉన్నా ఇంకా 10 లక్షల మంది పేదలు, చిన్న రైతు కూలీలు కార్డులు లేకుండా పనులు లేక వలసలు పోతున్నారని అన్నారు.
పాలేరు అభ్యర్తి ఎంపికపై 23న తుది నిర్ణయం :పిసిసి చీఫ్
ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెసు శాసనసభ్యుడు దివంగత రామిరెడ్డి వెంకటరెడ్డి మరణం సందర్బంగా జరుగనున్న ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికలో ఈనెల 23న పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని టిపిసిసి చీప్ యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దివంగత వెంకటరెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరిని నిలబెడుతామని ఉత్తమ్ అన్నారు.
డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణాలను పరిశీలించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
గురు, శుక్రవారాలలో హుజూర్‌నగర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన స్థానిక శాసనసభ్యుడు, టిపిసిసి చీప్ యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణాలను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి భవనాలు అందంగా, చక్కగా నిర్మించాలని కాంట్రాక్టర్‌ను, అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు టి మల్లిఖార్జునరావు, సి అమర్‌నాధ్‌రెడ్డి, రాష్ట్ర ఐయన్‌టియుసి ఉపాధ్యక్షుడు యరగాని నాగన్న, కిసాన్‌సెల్ అధ్యక్షుడు పశ్య వెంకటరెడ్డి, సుతారి వేణు, యల్ నాగేశ్వరరావు, యరగాని గుర్వయ్య, అరుణ్‌కుమార్, గొట్టె రామయ్య పాల్గొన్నారు.