నల్గొండ

నేటినుంచి మన తెలంగాణ-మన వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 24: జిల్లాలో నేటి నుండి మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమం కింద గ్రామాల్లో అవగాహాన సదస్సులు నిర్వహించనున్నారు. జిల్లాలోని 59మండలాల్లో 10రోజుల పాటు సాగనున్ను మన తెలంగాణ-మన వ్యవసాయ కింద అన్ని గ్రామాల్లో రైతులకు అవగాహాన సదస్సులు నిర్వహిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులకు పంటల సాగులో సూచనలు, మేళకువను అందించడంతో పాటు ఏ భూముల్లో ఏ పంటలు వేసుకోవాలన్న సలహాలను ఈ సదస్సుల ద్వారా అందించనున్నారు. ముఖ్యంగా రానున్న సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువుల ప్రణాళికలను సైతం ఈ సదస్సుల ద్వారా సిద్ధం చేయనున్నారు. ఎండల తీవ్రత నేపధ్యంలో ఉదయం 7గంటల నుండి 11-30వరకు మాత్రమే సదస్సులు నిర్వహించనుండగా అదికూడా రోజుకు రెండు మూడు గ్రామాల్లో మాత్రమే సదస్సులు నిర్వహించనున్నారు. మే 5వ తేది వరకు మన తెలంగాణ-మన వ్యవసాయ సదస్సులు కొనసాగనున్నాయి. సదస్సుల నిర్వాహణకు ప్రతి మండలానికి ప్రభుత్వం 22,500రూపాయలు సైతం కేటాయించింది. కరపత్రాలు, మైక్‌లతో రైతులకు పంటల సాగులో సూచనలిస్తు, రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తు ఈ సందర్భంగా విస్తృత ప్రచారం చేపట్టనున్నారు.కాగా మన తెలంగాణ-మన వ్యవసాయం సదస్సులకు గ్రామాలకు వచ్చే అధికారులకు రైతుల నుండి కరవు సహాయం పట్ల ప్రభుత్వం జాప్యం, పంట రుణాల మాఫీలో సమస్యలపై నిలదీతలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. అలాగే రబీ ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు, ధాన్యం డబ్బుల చెల్లింపుల్లో జాప్యంపై రైతుల నుండి అధికారులకు వాగ్వివాదాలు నెలకొనే పరిస్థితులున్నాయి.
రైతుల ముంగిటకు 14 శాఖల యంత్రాంగం
మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమం కింద జిల్లాలోని 14శాఖల అధికారులను భాగస్వామ్యం చేయనున్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖలు, పశు సంవర్థక శాఖ, పట్టుశాఖ, విద్యుత్, మార్కెటింగ్, ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, ఆత్మ, మత్స్యశాఖ, అటవీశాఖలు, బ్యాంకర్లు, డిఆర్‌డిఏ, డ్వామా శాఖల యంత్రాంగం ఈ సదస్సులకు హాజరుకానున్నాయి.
ఆయా శాఖల ద్వారా ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన పథకాలను సదస్సుల్లో రైతులకు వివరించనున్నారు. రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీ అంశాలపైన, సబ్సిడీ పథకాల పట్ల రైతులకు అవగాహన కల్పించనున్నారు.