నల్గొండ

కొత్తగా ఉద్యోగాలు వచ్చే రంగాల పట్ల చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, నవంబర్ 17: రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధిక భాగం ఇతర రంగాలకు ఖర్చుపెడుతూ నూతనంగా ఉద్యోగాలు వచ్చే రంగాల పట్ల చిన్న చూపు చూస్తున్నారని టిజేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో యాదాద్రి భువనగిరి జిల్లా జేఏసి చైర్మన్ పూస శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మంది చదువుకున్న యువత ఉద్యోగాలు రాక పడిగాపులు కాస్తున్నారన్నారు. నిరాశ నిసృహలకు లోనై పలు జిల్లాల్లో యువకులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయన్నారు. కావున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పై చీలుకు ఉద్యోగాలను తక్షనమే భర్తీ చేయాలన్నారు. యాదాద్రి దేవస్థానంలో అభివృద్ధి పనులు చేపడుతున్న వైటిడిఏ లో పూర్తిగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. అందుకే లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 30న హైద్రాబాద్‌లో కొలువులకై కొట్లాట సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, కాంగ్రెస్ మండలాద్యక్షుడు బీర్ల ఐలయ్య, ఉపసర్పంచి గుండ్లపల్లి భరత్‌గౌడ్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్, డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు అమలులో విఫలం
* మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ధ్వజం
పెన్‌పహాడ్, నవంబర్ 17: ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలుచేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పటేల్ రమేష్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని అనాజీపురం గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు దాసరి జానయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో వేణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, కాంగ్రెస్ నాయకులు సూదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, తూముల సురేష్‌రావు, మండలి పిచ్చయ్య, అనుములపురి శ్రీను, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.