నల్గొండ

సమ, సత్వర న్యాయమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, నవంబర్ 18: సమన్యాయం, సత్వర న్యాయమే ప్రధాన ధ్యేయంగా భారత న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతుందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం నల్లగొండ న్యాయ సేవాసదన్‌లో జరిగిన న్యాయ సేవాధికార వారోత్సవాల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌరుల హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందవచ్చన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, పిల్లలు, మహిళలు, వికలాంగులకు న్యాయవ్యవస్థ ఉచితంగా న్యాయ సహాయం అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఎస్పీ డివి.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ కేసుల విచారణ వేగవంతంగా జరగడానికి తమ శాఖ సకాలంలో సాక్షులను కోర్టుల్లో ప్రవేశపెడుతుందన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి తమ శాఖ న్యాయ స్ధానాలకు సహకరిస్తుందన్నారు. జిల్లా జడ్జీ డి.తిరుమల్‌రావు మాట్లాడుతూ న్యాయ సేవా వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో న్యాయ విజ్ఞాన శిబిరాలు నిర్వహించి, కరపత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సహకారంతో వారోత్సవాలు విజయవంతమైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన పలువురికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కె.ప్రభాకర్‌రావు అధ్యక్షత వహించగా, న్యాయమూర్తులు కెపి.వింద్యేశ్వరి, కళ్యాణ్ చక్రవర్తి, మాధవి లత, రోజారమణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్, న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, ఎం.లెనిన్‌బాబు, ఎన్.్భమార్జున్‌రెడ్డి, ఎం.ప్రమీల, మంద నగేష్, శంకరయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్ల నాగయ్య, కృష్ణారెడ్డి, క్రాంతికుమార్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.