నల్గొండ

ఆటోస్టార్టర్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 19: వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా నేపధ్యంలో రైతులు తమ పంప్‌సెట్లకు విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేసుకున్న ఆటోమెటిక్ స్టాటర్లను తొలగించేందుకు ట్రాన్స్‌కో రంగంలోకి దిగుతుంది. డిసెంబర్ 5వ తేది నుండి ఆటోమెటిక్ స్టాటర్ల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర జెన్‌కో-ట్రాన్స్‌కోల సిఎండి ప్రభాకర్‌రావు ప్రకటించడం రైతాంగంలో గుబులు రేపుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఆటోమెటిక్ స్టాటర్ల తొలగింపు అవసరంపై అవగాహాన కల్పించాలని, వాటి వినియోగంతో భూగర్భ జలాలు తరిగిపోవడం, మోటార్లు నిరంతరాయంగా నడిచి త్వరగా పాడైపోవడం వంటి అనర్ధాలను విడమరిచి చెప్పాలని సిఎండి సూఛనలిచ్చారు. ఇంతకాలం ఆటోమెటిక్ స్టాటర్లకు అలవాటు పడిన రైతులు పొలం వద్ధకు రాత్రి, పగలు వెళ్లనవసరం లేకుండా అప్పుడప్పుడు వెళ్లి మోటార్లు నడుస్తున్నాయా పొలానికి నీరు అందుతుందా లేదోనంటు పరిశీలన చేసుకునేవారు. ఏదైనా మరమ్మతులు వస్తే తప్ప స్టాటర్ పెట్టే వద్ధకు వెళ్లడం రైతులకు అవసరం లేకుండా రోజులు గడిచాయి. ప్రభుత్వం జనవరి 1నుండి అధికారికంగా 24గంటల విద్యుత్ సరఫరాకు సిద్ధమైన తరుణంలో రైతులు విచ్చలవిడిగా విద్యుత్ వినియోగం చేయకుండా ఆటోమెటిక్ స్టాటర్లను తొలగించాలని స్పష్టం చేసింది. ఇకమీదట 24గంటల ఉచిత సాగు విద్యుత్ వినియోగించుకోవాలంటే రైతులు విధిగా తమ పొలాల వద్ధ ఉండి మోటార్లు నడిపించుకోవాల్సివుంటుంది. ఈనెల 6నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా సాగుకు 24గంటల విద్యుత్ సరఫరా సాగుతున్నప్పటికి రైతులు ఆటోమెటిక్ స్టాటర్లను తొలగించలేదు. అయితే విద్యుత్ దుర్వినియోగం కాకుండా, భూగర్భ జలాల రీచార్జ్ ప్రక్రియల పరిరక్షణల నేపధ్యంలో ఆటోమెటిక్ స్టాటర్ల తొలగింపు తప్పనిసరిగా ప్రభుత్వం భావిస్తుంది.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం
* సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
నల్లగొండ టౌన్, నవంబర్ 19: ఎన్నికల హామీలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక మగ్దూం భవన్‌లో జరిగిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని విమర్శించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న సీపీఐ పోరుబాట ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో డిసెంబర్ 3న జరిగే బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్, జనవరిలో శాఖల మండల మహా సభలు పూర్తి చేయాలని, ఫిబ్రవరిలో జిల్లా మహా సభలు జరపాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పార్టీ నాయకులు నెల్లికంటి సత్యం, పల్లా దేవేందర్‌రెడ్డి, కలకొండ కాంతయ్య, బంటు వెంకటేశ్వర్లు, ఎం.నర్సింహారెడ్డి, పొదిల శ్రీను, బి.వెంకటరమణ, పి.వీరస్వామి, ఎల్.శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.