నల్గొండ

టెట్ పరీక్షకు సన్నద్ధం కావాలి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 25: మే 1వ తేదిన నిర్వహించే టెట్ పరీక్షలను పగడ్భందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి సూచించారు. సోమవారం డైట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన టెట్ పరీక్షల సన్నాహాక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెట్ పరీక్షల నిర్వాహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలన్నారు. పరీక్షల సందర్భంగా ఈనెల 31, మే 1వ తేదిల్లో జిల్లా అధికారులకు, సిబ్బందికి సెలవులు ఉండవన్నారు. ఇతర కార్యక్రమాలు సైతం పెట్టుకోవద్ధన్నారు. జిల్లాలో 144పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 26,268మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. పేపర్-1జనరల్ స్టడీస్ ఉదయం 8-30నుండి 12గంటల వరకు, పేపర్-2గణితం, సోషల్ మధ్యాహ్నం 2-30నుండి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారన్నారు. పరీక్షా విధుల నిర్వాహణలో 1543మంది ఇన్విజిలేటర్లు, 51మంది సహాయ సూపరిండెంట్లు, 29మంది బీట్ ఆఫీసర్లతో పాటు మొత్తం 566మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారన్నారు. పరీక్షల సక్రమ నిర్వాహణకు అవసరమైన చర్యలపై ముందస్తుగా అవగాహాన ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిఈవో చంద్రమోహన్, డిప్యూటీ డిఈవోలు మదన్‌మోహన్, సత్యనారాయణ, స్పెషల్ కలెక్టర్ నిరంజన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టి మీదపడిన డిసిఎం -- డిసిఎంను ఢీకొట్టిన బస్సు

నలుగురు బస్సు ప్రయాణికులకు గాయాలు
* క్షతగాత్రులను తరలించిన కలెక్టర్, పోలీసులు
చిట్యాల, ఏప్రిల్ 25: వ్యవసాయబావి వద్దకు రాంగ్‌రూట్‌లో ట్రాక్టర్ వెళుతుండగా విజయవాడవైపుకు వెళుతున్న డిసిఎం ట్రాక్టర్‌ను తప్పించబోయి ప్రమాదవశాత్తు ఢీకొట్టి దానిపై పడి రోడ్డుకు అడ్డుగా పడిపోగా డిసిఎం వెనుకనుండి వస్తున్న ఆర్టీసి బస్సు డిసిఎంను ఢీకొట్టగా నలుగురికి గాయాలైన సంఘటన సోమవారం మండలంలోని పెద్దకాపర్తి శివారులో చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను డిసిఎం, డిసిఎంను ఆర్టీసి బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటుగా ముగ్గురు ప్రయాణీకులకు గాయాలైనాయి. చిట్యాల నుండి వ్యవసాయ పనిముట్లతో పెద్దకాపర్తి వైపునకు రాంగ్‌రూట్‌లో వెళుతుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపుకు వెళుతున్న డిసిఎం ఎదురుగా రోడ్డుపై వస్తున్న ట్రాక్టర్‌తో ప్రమాదం జరుగుతుందని ఊహించి డిసిఎం డ్రైవర్ ట్రాక్టర్‌ను తప్పించబోగా ప్రమాదవశాత్తు ఢీకొట్టి దానిపై పడి రోడ్డుగు అడ్డంగా పడిపోయింది. అదేసమయంలో హైదరాబాద్ నుండి ఆంద్రప్రదేష్ రాష్ట్రం కృష్ణాజిల్లా విజయవాడ-ఆటోనగర్‌కు చెందిన ఆర్టీసి బస్సు ఆటోనగర్‌కు వెళుతుండగా డిసిఎం రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డుగా పడిపోవడంతో దారిలేకపోగా ఆగేందుకు బ్రేకులు వేయగా వేగనియంత్రణ కాక డిసిఎంను ఢీకొట్టింది. ఈఘటనలో బస్సు డ్రైవర్ దోనె వెంకటేశ్వరరావు, ప్రయాణీకులు హైదరాబాద్‌కు చెందిన ఎస్‌కె కాషాబి, ఈలకత్తుల లక్ష్మమ్మ(సూర్యాపేట) నల్లమోతు చిట్టెమ్మ(విజయవాడ)లకు గాయాలైనాయి. డ్రైవర్ వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలైనాయి. డిసిఎం రోడ్డుకు అడ్డుగా పడి బస్సు డిసిఎంను ఢీకొనడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రమాద సమచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అదేసమయంలో హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళుతున్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి ట్రాఫిక్‌లో చిక్కుకోగా ప్రమాద విషయం తెలుసుకుని ఘటనా స్థలాన్ని సందర్శించారు. గాయపడిన వారిని కలెక్టర్, పోలీసులు ఇతర వాహనాల్లో చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని శివారులోని ఆసుపత్రికి తరలించారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రోడ్డుపై అడ్డంగా పడిపోయిన డిసిఎం ట్రాక్టర్‌ను, డిసిఎంను ఢీకొట్టిన ఆర్టీసి బస్సును క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించి వాహనాలను క్రమబద్దీకరించారు. ఈమేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాపు జరుపుతున్నారు.

వడదెబ్బతో శతాధిక వృద్ధురాలు మృతి

కోదాడ, ఏప్రిల్ 25: నల్లగొండ జిల్లా కోదాడ పట్టణ శివారు బాలాజీనగర్‌కు చెందిన శతాధిక వృద్ధురాలు భూక్యా ద్వాళీభాయి (107) సోమవారం వడదెబ్బ తగిలి మృతి చెందారు. 107 సంవత్సరాలు వయస్సు వచ్చినా ద్వాళీభాయి కర్రపట్టలేదు, కళ్లద్దాలు పెట్టలేదు, పళ్లు ఊడలేదు, నెత్తి నెరవకుండా ఆరోగ్యంగా జీవించిందని బంధువులు చెప్పారు. బాలాజీనగర్‌లో అందరూ యాడీ (అమ్మ)గా పిలచే ద్వాళీభాయికి అనారోగ్యమంటే తెలియదని, ఒక్క సెలైన్, ఒక్క మాత్ర జీవితకాలంలో మింగలేదన్నారు. పూర్తి ఆరోగ్యంగా వున్న ద్వాళీభాయి వడదెబ్బకు మృతిచెందడంవలన బాలాజీనగర్ పెద్ద దిక్కును కోల్పోయిందని గ్రామస్ధులు కంటతడిపెట్టారు. ద్వాళీభాయికి ఒక్క కుమార్తె వుండగా మనుమలు, మనుమరాళ్లు, మునిమనుమలు కలిసి వందమందివరకు కుటుంబసభ్యులు వున్నారు. కాగా ద్వాళీభాయి మృతదేహాన్ని కోదాడ మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు, మున్సిపాలిటీ తెరాస ఫ్లోర్‌లీడర్ పార సీతయ్య, కౌన్సిలర్‌లు షేక్ నరుూమ్, వీరారెడ్డి, వాల్యానాయక్, షేక్ షఫీ, చందర్రావు, ప్రసాద్, పాలూరి సత్యనారాయణ, గ్రామపెద్దలు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.
వడదెబ్బ సోకి ప్రభుత్వ ఉద్యోగి మృతి
మిర్యాలగూడ, ఏప్రిల్ 25: వడదెబ్బ సోకి ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంకు చెందిన ఎండి.అల్లాబకాష్(59) త్రిపురారం మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
పెద్ద అడిశర్లపల్లి, ఏప్రిల్ 25: మండలంలోని గుడిపల్లి గ్రామ పంచాయిలోగల ఆంజనేయపురం గ్రామానికి చెందిన తోక లక్ష్మయ్య(35) వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు. బందువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత శనివారం తన తల్లి మృతి చెందడంతో అంత్య క్రియలతోపాటు పలు పనులపై బయట తిరగడం వల్ల వడదెబ్బకు గురయ్యాడు.
వడదెబ్బతో యువకుడు మృతి
మోతె, ఏప్రిల్ 25: వేసవి తీవ్రత ఎక్కువడంతో వృద్దులు, యువకులు తేడా లేకుండా వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. మండలపరిధిలోని నర్సింహ్మపురం గ్రామానికి చెందిన చేకూరి మహేష్(28) వడదెబ్బకు గురై మృతిచెందాడు.
వడదెబ్బకు వ్యక్తి మృతి
భువనగిరి, ఏప్రిల్ 25: మండలంలోని గౌస్‌నగర్ గ్రామంలో పి.కృష్ణ(40) వడదెబ్బకు గురై మరణించినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.
వడదెబ్బతో వృద్ధుడు మృతి
చిట్యాల, ఏప్రిల్ 25: మండలంలోని పెద్దకాపర్తి గ్రామపంచాయతి పరిధిలోని ఆరెగూడెంకు చెందిన గుంటోజు సత్యనారాయణ(80) ఎండ వేడిమికి తట్టుకోలేక వడదెబ్బ అస్వస్థకు గురై వడదెబ్బతో మృతిచెందాడు.