నల్గొండ

పాలగుట్ట పట్టాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఏప్రిల్ 26: గుట్టనూ కబ్జా చేసిన రాబంధులు అనే శీర్షికన ఈ నెల 23 న ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్తకు జిల్లా అధికారులు స్పందించారు. చందంపేట మండలం ముడ్దండ్ల గ్రామపంచాయతి పరిధి లోని అచ్చంపేట పట్టిలో సర్వే నెంబర్ 50లో గల పాలగుట్టపై సేద్యానికి అనువుగాని గుట్టపై వి ఆర్వో కవిత, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం నిజామాబాద్‌కు బదిలీపై వెళ్ళిన తహశీల్దార్ యేలేశంలు నిబంధనలకు విరుద్దంగా పట్టాలు ఇచ్చారని ప్రాధమికంగా నిర్ధారణ కావడంతో తక్షణమే ఇచ్చిన పట్టాలను రద్దు చేసి పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ ఇన్‌చార్జ్ ఆర్డీవో వెంకటాచారి చెప్పారు. మంగళవారం రోజు విచారణ అధికారి, దేవరకొండ ఇన్‌చార్జ్ ఆర్డీవో వెంకటాచారి ఆర్డీవో కార్యాలయంలో వీ ఆర్వో కవితను స్వయంగా విచారించి ఆమె నుండి వాంగ్మూలం తీసుకున్నారు. విచారణ అనంతరం ఆర్డీవో వెంకటాచారి మాట్లాడుతూ వి ఆర్వో కవిత, అప్పటి తహశీల్దార్ యేలేశంలు నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా పట్టాలు ఇచ్చినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు.
జక్కుల అలివేలుపై ఐదు ఎకరాలు, జక్కుల శశికళ పై ఐదు ఎకరాలు, భోగరాజు నిర్మలమ్మపై ఐదు ఎకరాలు, నకిరేకంటి నాగమణిపై ఐదు ఎకరాలు, ఎలిజర్ల అలివేలుపై ఐదు ఎకరాలు, నరందాసు అంజమ్మపై ఐదు ఎకరాలు, జక్కుల మునయ్య పేరుపై 2.20 ఎకరాలు పట్టా చేసి పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లను ఇచ్చారని చెప్పారు.
అయితే పాస్‌పుస్తకాలను జారీ చేసినట్లు 17 రిజిస్టర్‌లో నమోదు చేయలేదని, అమెండ్‌మెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయలేదని ఆయన చెప్పారు. వీ ఆర్వో కవిత ఐదుగురి పేర్లపై ఇచ్చిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లను ఆమె నుండి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పాస్‌పుస్తకాలపై సంతకాలు పెట్టిన అప్పటి తహశీల్దార్ యేలేశం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్నాడని అతన్ని కూడా పిలిపించి విచారణ జరిపిన అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఆయన చెప్పారు. అయితే 32.20 ఎకరాలు పట్టా చేసి పాస్‌పుస్తకాలు జారీ చేసిన కేసులో పూర్తి స్ధాయి ఫైల్ అందుబాటులో లేదని ఈ ఫైల్‌పై ఆర్ ఐ, డిటిలు సంతకాలు పెట్టారా లేక వీ ఆర్వో, తహశీల్దార్‌లే సంతకాలు పెట్టి పాస్‌పుస్తకాలు జారీ చేశారా అన్నది తేలాల్సి ఉందని ఆర్డీవో వెంకటాచారి చెప్పారు. పాసుపుస్తకాలు తీసుకున్న వారు వాటిని బ్యాంక్‌లో కుదువపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్నారా అన్నది కూడా పూర్తి స్ధాయిలో విచారణ జరపాల్సి ఉందన్నారు. పూర్తి స్ధాయిలో విచారణ జరిపిన అనంతరం బాధ్యులైన అధికారులు, పట్టాలు పొందిన వారిపై ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు.
వీఆర్వో, తహశీల్దార్ సస్పెన్షన్ ?
చందంపేట మండలం ముడ్దండ్ల గ్రామపంచాయతి పరిధి లోని పాలగుట్టపై అక్రమంగా 32.20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసిన వీ ఆర్వో కవిత, తహశీల్దార్ యేలేశంలపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు. ఒకటి రెండు రోజుల్లో వీ ఆర్వో కవిత, తహశీల్దార్ యేలేశంలపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు తెలిసింది.