నల్గొండ

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, డిసెంబర్ 17: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఆదివారం అఖిల భారత పెన్షనర్స్ డేను పురస్కరించుకొని జిల్లా పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన వసతులు, ఆర్థిక వనరులు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ట్రెజరీస్, అకౌంట్స్ డిప్యూటీ డైరెక్టర్ వీయస్. నర్సింహ, పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు టేకుల లక్ష్మీనారాయణరెడ్డి, గుడపూరి రాములు, యాదగిరిగౌడ్, మోహన్‌రెడ్డి, రవీందర్‌రెడి,్డ తదితరులు పాల్గొన్నారు.
కోరేగావ్ విజయయాత్రను విజయవంతం చేయాలి
చిట్యాల, డిసెంబర్ 17: దళితుల వీరత్వానికి ప్రతీకగా పూణేలో 1817 జనవరి 1 న ఏర్పాటు చేసిన కోరేగావ్ స్ధూపాన్ని స్మరిస్తూ నిర్వహించనున్న కోరేగావ్ విజయ యాత్రలో దళితులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వరుణ్‌కుమార్, మందాల భాస్కర్ విద్యార్ధి జేఏసి చైర్మెన్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో కోరేగావ్ యాత్ర అవగాహన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌కుమార్ మాట్లాడుతూ దళితులు వీరత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా 1817 లో కోరేగావ్ వద్ద స్ధూపాన్ని ఏర్పాటు చేశారని ఈ స్థూపాన్ని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, జ్యోతీరావు పూలే లాంటి మహానుభావులు సందర్శించి అనేక సంఘసేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. కార్యక్రమంలో ప్రమోద్ మహారాజ్, నల్ల బాబు, డీ ఈ సుందర్‌రావు, డాక్టర్ కిరణ్‌కుమార్, నేరడ సర్పంచ్ ఎల్లయ్య, గంటెపాక స్వామి, గ్యార శేఖర్, దాసరి నర్సింహ్మ, జిట్ట చంద్రకాంత్, మేడి హరికృష్ణ, కట్ట అంబేద్కర్, గాదె ఎల్లేశ్, బుస్సు మధుసూదన్, నూనె శ్రీకాంత్, పాల మహేశ్, పాల శివ, మంచాల గణేశ్, తదితరులు పాల్గొన్నారు.

టీ-మాస్ బైక్ ర్యాలీ
వలిగొండ, డిసెంబర్ 17: మండల కేంద్రంలో ఆదివారం నాడు టీ-మాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నేడు నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బైక్‌ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీ- మాస్ జిల్లా కన్వీనర్ కల్లూరి మల్లేశం మాట్లాడుతూ టీ-మాస్ మహాసభకు సామాజిక విప్లవకారుడు, ప్రజాయుద్దనౌక గద్దర్ హాజరవుతున్నారన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎంబీసీ, అగ్రవర్ణ పేదలకు సామాజిక న్యాయం దక్కడం లేదన్నారు. ఎన్నికల్లో హామీల్చిన ప్రభుత్వాలు వాటిని చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నేడు జరిగే టీ-మాస్ మహాసభకు అన్ని కులాలు, సామాజిక తరగతులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిర్పంగి స్వామి, వేముల మహేందర్, మద్దెల రాజయ్య, వరికుప్పల మల్లేశం, సాయిని యాదగిరి, చాట్లపాండు, తుర్కపల్లి సురేందర్, నానంచర్ల రమేశ్, చీర్క శ్రీశైలంరెడ్డి, కంకల శ్రీనివాస్, చంద్రవౌళి, దుబ్బ లింగం, యాదగిరి, శ్రీకాంత్, మనోహర్, జైపాల్, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.