నల్గొండ

కుమ్మరి హక్కుల సాధనకై ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, డిసెంబర్ 17: కుమ్మరి హక్కుల సాధనకై ఉద్యమించాలని కుమ్మరి యువసేన రాష్ట్ర కార్యదర్శి కంభంపాటి సతీష్ పిలుపునిచ్చారు. యువసేన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సతీష్‌ను ఆదివారం చిట్యాల మండల కేంద్రంలో మండల కార్యదర్శి డోర్నాల సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ కుమ్మరుల ఆశయ సాధన కోసం యువసేన కృషి చేస్తుందన్నారు. కుమ్మరి వృత్తి చేస్తూ జీవ నం సాగించే ప్రతి ఒక్కరికీ పెన్షన్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 1072ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కుమ్మరి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తడూరి చంద్రం, మండల నేతలు సిలువేరు నర్సింహ్మ, కంభంపాటి నర్సింహ్మ, బొడ్డుపల్లి మల్లేశ్, సిలువేరు శేఖర్, సిలువేరు పరమేశ్, రాచకొండ మహేశ్, బొడ్డుపల్లి శంకర్, ఆరుకొండ వెంకటేశ్, సిలువేరు రిశ్వంత్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
వౌలిక వసతుల కల్పనకు కృషి
* ప్రభుత్వ విప్ సునీత
ఆలేరు, డిసెంబర్ 17: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని శివలాల్‌తండా గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి ఫలాలు పేదలందరికీ అందుతాయన్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో నివేదికలు తయారుచేసి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుచేయించి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరుగుదొడ్లు, ఆవాస గ్రామాల లింక్ రోడ్లను అభివృద్ధిపరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తండావాసులు తమ సమస్యలను ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకవచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పరమేశ్వర్, వైస్ ఎంపీపీ వరికుప్పల కిష్టయ్య, సర్పంచ్ విజయ, ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, సంతోష్, కృష్ణ, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.